గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 17, 2020 , 01:12:56

సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి..

సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి..

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రి కేటీఆర్ అభ్య ర్థులకు సూచించారు. గురువారం మున్సిపల్ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి అభ్యర్థి ఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్  అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరించాలని కోరారు. ప్రతి ఇంటికి పింఛన్  వస్తున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ వర్కర్లకు రెండు వేల రూపాయల పింఛను ఇస్తున్న విషయం గుర్తు చేయాలని ఆయన అ న్నారు.

రాష్ట్రంలోని బీడు భూములన్నీ సస్య శ్యామలం చేసేందుకు మిషన్ కాకతీయ పథకంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆ యన వివరించారు. ఎల్లారెడ్డిలోని 8వ వార్డుల్లో టీఆర్ అభ్యర్థి నునుగొండ భూదేవి   ప్రచా రం చేస్తుండగా కేటీఆర్ ఫోన్ కాల్ రావడంతో ఆమె కార్యకర్తలతో కలిసి విన్నారు. కేటీఆర్ మాటలతో కార్యకర్తలు మరింతగా ఉత్సాహంగా   ప్రచారంలో పాల్గొన్నారు.   logo
>>>>>>