బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 17, 2020 , 01:06:36

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేయాలి

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేయాలి

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. జనహిత భవన్ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై గురువారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వ శాఖలు సాధించిన పురోగతిపై నివేదికలను ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలని సూచించారు. స్టాల్స్, ట్యాబ్ ఏర్పాట్లపై శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ ఓటర్ డే, పల్లె ప్రగతిపై ప్రత్యేక ట్యాబ్ (శకటాలు) ఏర్పాటు చేయాలన్నారు. పల్లెప్రగతిలో ఉత్తమ గ్రామ పంచాయతీలను మూడు విభాగాల్లో ఎంపిక చేసి ఉత్తమ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ప్రతిపాదనలు పంపాలన్నారు.

జిల్లాకు నీటి సంరక్షణ విభాగంలో స్కోచ్ అవార్డు రావడంపై సంబంధిత అధికారులు., రిలయన్స్ ప్రతినిధులను సన్మానించారు. ఉపాధి హమీ పథకం ద్వారా మున్సిపల్ అనుబంధ శాఖల సమన్వయంతో ట్రెంచ్, ఫాంపాండ్, ఇంకుడు గుంతలు, హరితహారం పూర్తి స్థాయిలో చేపట్టడం ద్వారా జిల్లాకు జాతీయస్థాయిలో సిల్వర్ అవార్డు లభించిందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాశివనం, పోలీస్ ఫాంపాండ్ ద్వారా వాటర్ రిచార్జ్ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గాంధారి మండలం కరక్ గ్రామ పంచాయతీ నీటి సంరక్షణపై విశేష కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వసంతను అభినందించారు. ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ& ప్రజాప్రతినిధులు అధికారుల కృషితోనే స్కోచ్ అవార్డు జిల్లాకు లభించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రత్యేకాధికారి వెంకటేశ్ దోత్రె, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జేసీ యాదిరెడ్డి, డీఆర్డీవో చంద్రమోహన్ పాల్గొన్నారు.logo
>>>>>>