గురువారం 09 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 15, 2020 , 01:53:08

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
  • -కలెక్టర్‌ సత్యనారాయణ
  • - బాన్సువాడ, ఎల్లారెడ్డిలో పర్యటన
  • - కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూంల పరిశీలన
  • - అధికారులకు పలు సూచనలు

బాన్సువాడ రూరల్‌ : బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల కౌటింగ్‌ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆర్డీవో రాజేశ్వర్‌, డీఎస్పీ దామోదర్‌రెడ్డికి కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఎన్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల రిసెప్షన్‌ కౌంటర్‌, ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, కౌంటింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. 19 వార్డుల కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాల వద్ద చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి, ఎంపీడీవో యావర్‌ హుస్సేన్‌ సూఫీ, సీఐ మహేశ్‌గౌడ్‌, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

పురపోరుకు కొనసాగుతున్న ఏర్పాట్లు..

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : పురపాలక ఎన్నికల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌ రూమును  మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 80 వార్డులు ఉన్నాయని, 188 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో డిజిటల్‌ సర్వేలైన్స్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

1135  సిబ్బంది నియామకం

ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో 1135 మంది సిబ్బందిని నియమించామని, వారికి ఈ నెల 17న పోలింగ్‌పై శిక్షణ ఇస్తామని అన్నారు. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఉంటుందని తెలిపారు. కామారెడ్డి ఎన్నికల కోసం 760 మంది, బాన్సువాడలో పని చేయడానికి 230 మంది, ఎల్లారెడ్డిలో పనిచేసేందుకు 145 మంది సిబ్బందిని నియమించామని వివరించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల తయారీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎనికల్లో పోలింగ్‌తో పాటు ఇతర విధులు నిర్వహించే వారు ఓటు వేసేందుకు బ్యాలెట్‌ ఓటింగ్‌కు అవకాశం ఇస్తామని చెప్పారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో దేవేందర్‌ రెడ్డి, సీఐ రాజశేఖర్‌, మున్సిపాలిటీ కమిషనర్‌ రాజ్‌వీర్‌, తహసీల్దార్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు. logo