సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 15, 2020 , 01:52:30

వైభవంగా గోదాదేవి, రంగనాయకుల కల్యాణం

వైభవంగా గోదాదేవి, రంగనాయకుల కల్యాణం

దోమకొండ : మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజేందర్‌ ఆధ్వర్యంలో గోదాదేవి, రంగనాథుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి సంవత్సరం కల్యాణం నిర్వహిస్తామని తెలిపారు. కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుంచాల శేఖర్‌, విండో చైర్మన్‌ నర్సారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నర్సయ్య, సర్పంచ్‌ అంజలి, వార్డుసభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు తదతరులు పాల్గొన్నారు.
చుక్కాపూర్‌

లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో...

మాచారెడ్డి : మండలంలోని చుక్కాపూర్‌ గ్రామంలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గోదా రంగనాథుల కల్యాణాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఆలయంలో కల్యాణం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, పారాయణం, మహా నైవేద్యం, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో వెంకట్‌నారాయణ, సిబ్బంది కె.సంతోష్‌, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పరంధామాచార్యులు, నర్సింహాచార్యులు పాల్గొన్నారు.


logo