శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 15, 2020 , 01:49:23

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీ ఫాంల అందజేత

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు  బీ ఫాంల అందజేత

బాన్సువాడ రూరల్‌ : నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియడంతో పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ తరఫున కౌన్సిలర్లుగా పోటీచేస్తున్న అభ్యర్థులకు దేశాయిపేట్‌ సహకార సంఘం అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి బీ ఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు కేటాయించిదని తెలిపారు. బాన్సువాడ మున్సిపాలిటీలో 19 స్థానాలను గెలుచుకొని మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పట్టణంలో చేసిన అభివృద్ధి, సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలే పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జంగం గంగాధర్‌, నార్ల సురేశ్‌ గుప్తా మహ్మద్‌ ఎజాస్‌, గురువినయ్‌ కుమార్‌, పాత బాలకృష్ణ, అచ్చుకట్ల జీవన్‌, రాజు పాల్గొన్నారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన గైక్వాడ్‌ రుక్మిణికి అభినందన..

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడ మున్సిపాలిటీలో 4వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన గైక్వాడ్‌ రుక్మిణిని పోచారం భాస్కర్‌రెడ్డి మంగళవారం అభినందించారు. ఆమె ఏకగ్రీవ ఎన్నిక పత్రాన్ని భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలోని 19 వార్డుల్లో గైక్వాడ్‌ రుక్మిణి ఏకగ్రీవం కావడంతో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.   కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, జడ్పీ మాజీ కోప్షన్‌ సభ్యుడు అలీమొద్దీన్‌ బాబా, బాలు, ఖయ్యూం నిషాత్‌, హన్మాండ్లు, మగ్దూం, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

logo