శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 14, 2020 , 02:52:49

బాన్సువాడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా విడుదల

బాన్సువాడ టీఆర్‌ఎస్‌   అభ్యర్థుల జాబితా విడుదల


బాన్సువాడ, నమస్తే తెలంగాణ :
 బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉండ గా సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు ,దేశాయిపేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి 12  మంది ఆభ్యర్థులకు టీఆర్‌ఎస్‌ పార్టీ బీ-ఫాంలను అందజేశారు.టీఆర్‌ఎస్‌ పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు దొడ్ల వెంకట్రామ్‌ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు నార్ల సురేశ్‌ గుప్తా, గురువినయ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, కొర్ల పోతురెడ్డి, కనుకుంట్ల రాజు, అలీమొద్దీన్‌ బాబా, నార్ల ఉదయ్‌, వీరారెడ్డి, వెంకట్రాం రెడ్డి, శేఖర్‌, లింగం, పార్టీ నాయకులు ఉన్నారు.logo