ఆదివారం 29 మార్చి 2020
Kamareddy - Jan 14, 2020 , 02:47:23

రెండు మున్సిపాలిటీల్లో 28 నామినేషన్ల ఉపసంహరణ

రెండు మున్సిపాలిటీల్లో 28 నామినేషన్ల ఉపసంహరణ


 కామారెడ్డి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి మున్సిపల్‌లోని 49 వార్డుల్లో వేసిన 356 నామినేషన్లలో ఆదివారం ఆరుగురు, సోమవారం 10 మంది మొత్తం 16 మంది నామినేషన్లు ఉపసంహరించు కున్నారు.  మంగళవా రం మద్యాహ్నం 3 గంటల వరకు విత్‌డ్రాకు సమయం ఉంది.   6వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ రెబల్‌గా వేసిన ముగ్గురు అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్నారు. 8వ వార్డు నుంచి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల నుంచి ఇద్దరు అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్నారు. 9వ వార్డులో టీఆర్‌ఎస్‌ నుంచి ఒకరు  విత్‌డ్రా చేసుకున్నారు. 11 వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్నారు. 14వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు,  టీఆర్‌ఎస్‌ నుంచి ఒకరు, ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థి విత్‌డ్రా చేసుకున్నారు. 36వ వార్డు నుంచి  కాంగ్రెస్‌ అభ్యర్థి, 38వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, 39వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థి, 40వార్డులో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, 43 నుంచి ఒక కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్లు ఉపసహరించుకున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శైల జ తెలిపారు.

బాన్సువాడ మున్సిపాలిటీలో..

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులకు గాను 134 మంది  206 నామినేషన్లు దాఖాలు చేశా రు. మూడు రోజులుగా నామినేషన్ల ఉప సంహరణలు కొనసాగుతున్నాయి.   సోమవారం ఉపసంహరణల్లో  భాగంగా తొమ్మిది మంది అభ్యర్థులు  18 సెట్లను ఉపసంహరించుకున్నారు. 2వ వార్డులో ఒకరు, 6వ వార్డులో ఒకరు, 7వ వార్డులో ఒకరు,8 వార్డులో ఒకరు, 9 వార్డులో ఒకరు, 10వ వార్డు లో ముగ్గురు, 17వ వార్డులో ఒకరు కలిపి 9 మంది ఆభ్యర్థులు 18 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.  ఇదిలా ఉండగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో సోమవారం ఒక్కరు కూడా నామినేషన్లను ఉపసంహరించుకోలేదు.


logo