గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 14, 2020 , 02:54:41

పురపోరులో అతివలే కీలకం

పురపోరులో అతివలే కీలకం


ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ :  కామారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపాలిటిలలో కలిపి 80 వార్డులు ఉండగా వాటిలో 39 వార్డులను మహిళలకు కేటాయించారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో 49 వార్డులు ఉండగా వాటిలో 24 వార్డులను మహిళలకు కేటాయంచారు. బాన్సువాడ మున్సిపాలిటిలో 19 వార్డులు ఉండగా వాటిలో మహిళలకు 9 వార్డలను కేటాయించారు. కొత్తగా ఏర్పాటైన ఎల్లారెడ్డి మున్సిపాలిటిలో 12 వార్డులు ఉండగా అందులో 6 వార్డులను మహిళలకు కేటాయించారు. పురు పోరులో మహిళలకు ఎక్కువగా అవకాశాలు రావడంతో పాటు పురుషులు తమకు అనుకూలంగా వార్డులు రాక పోవడంతో వారి సతీమణులను రంగంలోకి దించారు. కొన్ని వార్డుల్లో పురుషులకు ధీటుగా మహిళలు తాము సైతం అంటూ నామినేషన్లు వేశారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో జనరల్‌ వార్డుల్లో సైతం మహిళలు పోటి చేస్తున్నారు. కామారెడ్డి పురపాలక సంఘం చైర్మన్‌ పదవి మహిళకు రిజర్వ్‌ కావడంతో అక్కడ ప్రధాన నాయకులు మహిళలతో నామినేషన్లు వేయించారు.

ఓటర్లలో సగానికి పైగా మహిళలే..

పురుపోరు జరుగుతున్న మూడు మున్సిపాలిటీల్లో  పురుషుల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉన్నా యి. జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో పురుషుల ఓట్లు 41వేల 817 ఉండగా అక్కడ మహిళ ఓటర్లు 43వేల 326 మంది ఉన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో పురుష ఓటర్ల సంఖ్య 9,959 ఉండగా మహిళా ఓటర్లు 10585 ఉన్నారు. చిన్న మున్సిపాలిటీ ఎల్లారెడ్డిలో పురుష ఓటర్లు 5,781 ఉండగా మహిళా ఓటర్లు 6,212 ఉన్నారు. దీంతో ఆయా వార్డుల్లో ఫలితాలపై మహిళలే అధికంగా ప్రభావం చూపనున్నారు.  వార్డులలో రిజర్వేషన్లు రావడం, కామారెడ్డిలో మహిళకే పీఠం ఖాయం కావడం కారణంగా ఈ సారి జరుగుతున్న పురు పోరులో మహిళలు ముందువరుసలో ఉన్నారు.

పోటీకి సై..

పంచాయతీ ఎన్నికలలో పోటీ పడి పదవులు పొందినట్లుగానే పురుపోరులోనూ మహిళలు ముందు నిలుస్తున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో మహిళలు పురుషుల కంటే ఎక్కువగా పోటీ లో నిలుస్తున్నారు. అధ్యక్ష పదవి మహిళకు కేటాయించినందున అన్ని పార్టీల నుంచి మహిళలు పురుషులపై పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో జనరల్‌ మహిళకు చైర్మన్‌ పదవి ఉండడంతో బీసీలు, ఎస్సీలు, జనరల్‌ మహిళలు ఇక్కడ పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.   logo
>>>>>>