గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 14, 2020 , 02:54:10

గ్రామాల అభివృద్ధికి పల్లెప్రగతి బృహత్తర పథకం

గ్రామాల అభివృద్ధికి పల్లెప్రగతి బృహత్తర పథకం


బాన్సువాడ రూరల్‌ : గ్రామల అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెండో విడుత పల్లెప్రగతి పథకం ఒక బృహత్తర పథకమని, ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కీలకపాత్ర వహించడం హర్షణీయని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల అన్నారు. సోమవారం మండలంలోని బోర్లం గ్రామపంచాయతీలో పల్లెప్రగతి సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. సక్సెస్‌ మీట్‌లో మండలంలో వివిధ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. పల్లెప్రగతిపై కార్యదర్శులు తమ అభిప్రాయాలను తోటి కార్యదర్శులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపి కై గ్రామాభివృద్ధిలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నూతనంగా విధుల్లో చేరిన కార్యదర్శులకు మొదటి, రెండో విడత పల్లెప్రగతి  కార్యక్రమాలు ఎంతో అనుభవాన్ని తెచ్చిపెట్టాయని అన్నారు. పల్లె ప్రగతిని అమలు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పల్లెప్రగతి పథకంతో ఏండ్ల తరబడి గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు దూరమయ్యాయని అన్నారు. కార్యదర్శులు చిత్తశుద్ధితో పని చేసి కార్యక్రమాన్ని విజయంతం చేశారని అన్నారు. ప్రభుత్వం అమలు చసే ప్రతి పథకాన్నీ విజయంతం చేసేందుకు కార్యదర్శులు ముందుంటారని అన్నారు. కార్యక్రమంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు శ్రావణ్‌, సృజన్‌రెడ్డి, భాస్కర్‌, రఘు, సుధీర్‌, గురునాథ్‌, భరత్‌, రవి, గంగసాగర్‌, సురేశ్‌, రహేలాబేగం, ప్రశాంతి,సవిత పాల్గొన్నారు.logo