శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 14, 2020 , 02:53:30

అభ్యర్థుల తుది జాబితా తరువాత

అభ్యర్థుల తుది జాబితా తరువాత
  • - బ్యాలెట్‌ ముద్రణకు ఏర్పాట్లు చేయాలి


కామారెడ్డి నమస్తేతెలంగాణ : ఈ నెల 14న ఉప సంహరణ అనంతరం వెంటనే అభ్యర్థుల చివరి జాబితా సిద్ధం చేసి బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. వార్డుల వారీగా అభ్యర్థులకు తెలుగు వర్ణమాల ప్రకారం సీరియల్‌ నంబర్లు, గుర్తులు కేటాయించేలా సంబంధిత నోడల్‌ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు నిషితంగా పరిశీలించాలని సూచించారు. గుర్తించబడిన ఏడు పార్టీలకు కామన్‌ గుర్తుగా ఒక సింబల్‌ను కేటాయించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఆర్వో, ఏఆర్వోలు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వంద శాతం ఓటరు నమోదు ఉండేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.  ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తమ ఓటు హక్కును ఎన్నికల సంఘం వెబ్‌ పోర్టల్‌ ద్వారా లేదా ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో నిర్ణీత కాలంలో ఆర్వోకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లకు సందేహాలు లేకుండా పోలింగ్‌ స్టేషన్ల వారీగా జాబితాను ప్రచురించాలన్నారు. ఓటర్లు రెండు సార్లు ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా టెండర్‌ ఓటును కోరితే  వెంటనే ఎన్నికల సంఘానికి నివేదించేలా ఆర్వోలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇతరుల ఓటు వేసిన వారిపై క్రిమినల్‌ చర్యలు ఉంటాయన్నారు. ఓటర్లను గుర్తించేందుకు వార్డుల వారీగా అడిషనల్‌ పోలింగ్‌ స్టాఫ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఓటర్ల వివరాల సవరణలు సప్లమెంటరీ ద్వారా ప్రచురించాలన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న వారికి రెండోసారి శిక్షణ, కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పరిశీలకుల సమక్షంలో వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, స్టేషనరీ, ఫ్ల్లయింగ్‌ స్వాడ్స్‌ నిరంతరాయంగా పని చేయాలన్నారు.  పోలింగ్‌ కేంద్రాల సామర్థ్యం, సంఖ్యను బట్టి కౌంటింగ్‌ నాడు టేబుళ్లను ఏర్పాటు చేసి సాయంత్రం నాలుగు గంటల లోపు ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్‌, కౌంటింగ్‌ రోజు వెబ్‌ కాస్టింగ్‌ చేయాలన్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లకు లొకేషన్‌ మ్యాపును అప్‌లోడ్‌ చేయాలని, పోలింగ్‌నాడు అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ నిర్వహణపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ యాదిరెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ వెంటేశ్‌ దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, మున్సిపల్‌ ఎన్నికల నోడల్‌ అధికారి సాయన్న తదితరులు పాల్గొన్నారు.logo