మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Jan 13, 2020 , 01:56:07

జనంలోకి నాయకులు

జనంలోకి నాయకులు
  • - ప్రచారానికి శ్రీకారం చుడుతున్న ప్రజా ప్రతినిధులు
  • - రంగంలోకి దిగిన ప్రభుత్వవిప్‌ గంప గోవర్దన్‌,ఎమ్మెల్యే జాజాల
  • - బాన్సువాడలో అస్ర్తాలను సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే షిండే, పోచారం భాస్కర్‌ రెడ్డి
  • - టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆకర్షితులవుతున్నప్రతిపక్ష నాయకులు
  • - ప్రచార వ్యూహంలో దూకుడు పెంచనున్న గులాబీ శ్రేణులు
  • - రేపు భారీగా నామినేషన్లు విత్‌డ్రా చేసుకోనున్నరెబల్‌ అభ్యర్థులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పురపోరులో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు రేపటితో ముగియనుంది. బరిలో నిలిచేదెవరు? కదనరంగంలో ఢీకొనేదెవరన్నదీ మ ధ్యాహ్నం 3గంటల తర్వాత తేటతెల్లం కానుంది. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు అనేకులు నామినేషన్లు వేశారు. వీరిలో అత్యధికులు స్థానిక ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు పురపోరు నుంచి వె నక్కు తగ్గి పార్టీ నిర్ణయానికి శిరసావహించనున్నా రు. ఇప్పటికే చాలా మంది ఆశావహులు  స్థానిక నాయకుల మాటలకు తలొగ్గినట్లుగా తెలిసింది. మరికొందరిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టి తమ పార్టీ తరపున బీ-ఫారాలు ఇచ్చి పోటీకి దింపుతున్నట్లుగా తెలుస్తున్నది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగానే గెలు పు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలనే ఆలోచనతోనే టీ ఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు సాగుతున్నది. ఇందుకో సం వార్డుల వారీగా వారం రోజుల నుంచి పార్టీ ప్రజా ప్రతినిధులు, కీలక నాయకులకు వార్డుల వారీగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి అభిప్రాయాలను సేకరించారు. పార్టీ పరిస్థితి, కుల సం ఘాల నాయకులు, వార్డుల్లో కీలక నేతల వివరాలన్నీ సేకరించారు. స్థానిక ఎమ్మెల్యేల స్వీయ పర్యవేక్షణలో సాగిన సర్వేలో వెల్లడైన వివరాల ఆధారంగానే టికెట్లను ఖరారు చేశారు. దీంతో పాటుగా పార్టీకి చేసిన సేవను దృష్టిలో పెట్టుకోవడం, ఉద్య మ నేపథ్యాన్ని గమనించి టికెట్లు ఖరారు చేశారు. ఆయా వార్డుల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల బలాలు, స్థానిక అంశాలకు తగ్గట్లుగానే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిలబెట్టారు.

జనంలోకి నాయకులు...

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తమ పార్టీ బలాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్ల కిందట జరిగిన పురపాలక ఎన్నికలకు నేటి పరిస్థితులకు భారీ తేడాలు వచ్చాయి. కామారెడ్డి జిల్లా ఆవిర్భావంతో పాటుగా కొత్తగా రెండు మున్సిపాలిటీలు ఉద్భవించాయి. రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తదుపరి వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ కారు జోరుకు ప్రతిపక్షాలు కు దేలయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ మద్ధతుదారులే విజయ ఢంకా మోగించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని సాధించగా ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరులోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించింది. తాజాగా పుర పో రులోనూ కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ము న్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగుర వేయాలనే లక్ష్యంగా జిల్లా నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. గెలుపు సులువైనప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా ప్ర జల్లోకి వెళ్లి చేసిన అభివృద్ధిని, చేయబోయే కార్యక్రమాలను, కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలతో ఓట్లను అభ్యర్థించేందుకు సిద్ధం అవుతున్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ 38వ వార్డులో ఆదివారం పర్యటించి పలు పార్టీల నుం చి వచ్చిన నాయకులకు గులాబీ కండువా కప్పా రు. బాన్సువాడలో జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, పోచారం భాస్కర్‌ రెడ్డిలు ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఎల్లారెడ్డిలోనూ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సైతం దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతున్నారు.

బీ-ఫారాలు పొందిన వారే అధికారికం...

టికెట్‌ వస్తుందన్న నమ్మకం ఉన్న వారు కొంత మంది నామినేషన్లు వేయగా, మరికొందరైతే వ చ్చే అవకాశం లేకున్నా ముందుకు వచ్చారు. మరికొన్ని వార్డుల్లో ముందస్తు జాగ్రత్త చర్యగా ఒకరిద్దరు డమ్మీగా నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తున్నది. అసలు అభ్యర్థి నామినేషన్‌ చెల్లితే సరే... డమ్మీ నామినేషన్‌ చివరి రోజు ఉపసంహరించుకుంటారని, అలా కాకుండా ఒక వేళ తిరస్కరణకు గురైతే రెండో వ్యక్తి పోరులో నిలుస్తారనే ఆశతో నామినేషన్లు వేసిన వారూ లేకపోలేదు. ఎంత మంది నామినేషన్లు వేసినా 14వ తేదీ మ ధ్యాహ్నం 3గంటల్లోపు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతినిధులకు ఎవరు పార్టీ బీ-ఫారం అందిస్తారో వారే పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారు. ఆ అభ్యర్థికే ఆ పార్టీ గుర్తులను కేటాయిస్తారు. అ లా కాకుండా పార్టీ పేరుతో నామినేషన్‌ వేసినా బీ-ఫారం రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా మిగి లి పోవాల్సి ఉంటుంది. అటువంటి వారికి 14న గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఒకే పార్టీకి చెందిన పలువురు నేతలు ఒక వార్డు నుం చి పోటీలో నిలిస్తే పార్టీ మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని నాయకులు మంతనాలు సాగిస్తున్నారు. చుట్టాలు, బంధువులు, దగ్గ రి మిత్రులు ఇలా అన్ని రకాల అస్ర్తాలను సం ధించి నామినేషన్లు విత్‌డ్రా చేయిస్తున్నారు. వరు స పరాజయాలతో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు కొంత స్తబ్ధుగా ఉన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేర కు జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో కార్యక్రమా లు చేపడుతున్నప్పటికీ వాటికి స్పందన కురవైంది. కామారెడ్డి పట్టణంలో సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ వరుసగా పరాజయం పాలవ్వడంతో హస్తం నాయకులను నైరాశ్యంలోకి నెట్టింది. పుర ఎన్నికల్లో పుంజుకోవాలనే తలంపుతో నాయకత్వం ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌కు ప్రతికూల పవనాలు వీస్తుండడంతో పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం వెనుకా ముందు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందంటే అతిశయోక్తి కాదు.


logo
>>>>>>