మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Jan 13, 2020 , 01:52:23

నిఘా పటిష్టం

నిఘా పటిష్టం


ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ/బాన్సువాడ, నమ స్తే తెలంగాణ : పుర పోరును మద్యం, డబ్బులు ప్రభావితం చేయకుండా ఉండేందుకు అడుగడుగునా తనిఖీలు ప్రారంభమయ్యాయి, శుక్రవా రం వరకు నామినేషన్లు వేయడం పూర్తి కావడం తో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతు న్న నేపథ్యంలో ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఒక ఫ్లయింగ్‌ స్కాడ్‌తో పాటు ఒక ఎస్‌ఎస్‌  బృందా న్ని తనిఖీల కోసం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే దారుల్లో ఎస్‌ఎస్‌టీలను ఏర్పాటు చేసి అనుక్షణం తనిఖీ లు చేస్తున్నారు. ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందంలో త హసీల్దార్‌తో పాటు ఏఎస్సై స్థాయి అధికారి ఇద్ద రు పోలీసులు మరో వీడియోగ్రాఫర్‌ ఉంటున్నా రు. ప్రతి తనిఖీని వీడియో తీయడం ద్వారా పారదర్శకతను పాటిస్తున్నారు అధికారులు. దీనికి తో డు మున్సిపాలిటిలోకి ప్రవేశించే ప్రధాన రహదారుల్లో ఎస్‌ఎస్‌ బృందాలను ఏర్పాటు చేసి అన్ని రకాల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. 

మూడు ఫ్లయింగ్‌ స్కాడ్‌, మూడు ఎస్‌ఎస్‌ బృందాలు...

కామారెడ్డి జిల్లాలో పురు పోరులో అక్రమాలను నియంత్రించడానికి మూడు ఫ్లయింగ్‌ స్కాడ్‌, మరో మూడు ఎస్‌ఎస్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడలో ఈ బృందాలు విస్తృతంగా పర్యటించి అనుమానాస్పదంగా ఉన్న వారిని తనిఖీ చేస్తున్నాయి. ఆయా వార్డుల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఈ బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. వీటితో పాటు స్టాటిస్టికల్‌ సర్వేలెన్స్‌స్‌ బృందాలు మూడు పురపాలక సంఘాల్లో ప్రత్యేక తనిఖీలు చేస్తున్నాయి. కామారెడ్డిలోని నిజాంసాగర్‌ రహదారి, నిజామాబాద్‌ రహదారి, సిరిసిల్ల రహదారి, హైదరాబాద్‌ రహదారులపై ప్రత్యేకంగా చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు తనిఖీలు చేస్తున్నా రు. ఎల్లారెడ్డిలో మెదక్‌ రహదారి, నిజాం సాగర్‌ రహదారి, కామారెడ్డి రహదారుల్లో తనిఖీలు చేస్తున్నారు. బాన్సువాడలో నిజామాబాద్‌ రహదారి, పిట్లం రహదారి, నిజాంసాగర్‌ రహదారులపై ప్రత్యేకంగా చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు అధికారులు. 

ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు

ఓటర్లు ప్రలోభాలకు గురి కావద్దు. మున్సిపల్‌ ఎన్నికల కోసం ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశాం. పోలీసు అధికారుల బృందా లు వార్డుల్లో పర్యటిస్తున్నాయి. మద్యం, డబ్బు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేలా ప్రజలు సహకరించాలి.
-దామోదర్‌ రెడ్డి, డీఎస్పీ, బాన్సువాడ


logo
>>>>>>