శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 13, 2020 , 01:51:44

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంనస్రుల్లాబాద్‌ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. మండలంలోని మైలారం గ్రామంలో రూ.55 లక్షలతో నూతనంగా నిర్మించనున్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సబ్‌యార్డు, గేట్ల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్‌ మాట్లాడారు. నస్రుల్లాబాద్‌ నూతన మండలంగా ఏర్పాటు కావడంతో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గ్రామంలో 5 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో గోడౌన్‌ నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కువ వరి ధాన్యం పండించి అధక దిగుబడులు సాధించే రైతులు బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ కోసం 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గోడౌన్‌ స్థల సేకరణకు కృషి చేసిన ఏఎంసీ చైర్మన్‌ కవితను, అధికారులను అభినందించారు. అనంతరం గ్రామ పంచాయతీకి కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ తాళాన్ని సర్పంచ్‌ యశోదకు అందజేశారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కవిత, ఎంపీపీ పాల్త్య విఠల్‌, జడ్పీటీసీ సభ్యురాలు జన్నూబాయి, సర్పంచ్‌ యశోద, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పెర్క శ్రీనివాస్‌, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్‌ గంగాధర్‌, విండో చైర్మన్‌ అప్పారావు, మాజీ ఎంపీటీసీలు కంది మల్లేశ్‌, మహేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు దివిటి శ్రీనివాస్‌, కిశోర్‌, ప్రతాప్‌, చంద్రాగౌడ్‌, లక్ష్మీనారాయణ గౌడ్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ.. 

బీర్కూర్‌ మండలం భైరాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. విగ్రహదాత మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌ను అభినందించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని, బ్లడ్‌ బ్యాంక్‌ సేకరణ వాహనాన్ని ప్రారంభించారు. శిబిరంలో సుమారు 60 మంది యువకులు రక్తదానం చేశారు.

పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ...

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ వచ్చిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా భైరాపూర్‌ గ్రామంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో స్పీకర్‌ పాల్గొన్నారు. గ్రామాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. భైరాపూర్‌, మల్లాపూర్‌ గ్రామాల్లో మొక్కలకు నీటిని సరఫరా చేసేందుకు మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్‌ తన తండ్రి సీతారామయ్య జ్ఞాపకార్థం వాటర్‌ ట్యాంకర్‌ విరాళంగా అందజేయడంపై అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘు, జడ్పీటీసీ సభ్యురాలు స్వరూప, సర్పంచ్‌ అంజవ్వ, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, తహసీల్దార్‌ గంగాధర్‌, ఎంపీడీవో భోజారావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ద్రోణవల్లి అశోక్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఆరీఫ్‌, నాయకులు అప్పారావు, నాగేశ్వర్‌ రావు, వీరేశం, అంజాగౌడ్‌, సాయబ్‌ రావు, నారం శ్రీను, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


logo