మంగళవారం 07 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 12, 2020 , 02:31:31

టీఆర్‌ఎస్‌ నేతపై కాంగ్రెస్‌ నాయకుల దాడి

టీఆర్‌ఎస్‌ నేతపై కాంగ్రెస్‌ నాయకుల దాడి

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడలో టీఆర్‌ఎస్‌ నాయకుడిపై కాంగ్రెస్‌ నాయకులు శనివారం దాడికి పాల్పడ్డారు. బాధితుడు బుల్లెట్‌ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్‌ నాయకులు కాసుల బాల్‌రాజ్‌, కాసుల రోహిత్‌, నార్ల రత్నకుమార్‌, మాసాని రవీందర్‌ రెడ్డి, మాసాని శ్రీనివాస్‌రెడ్డి , మీరా నసీమొద్దీన్‌, నర్సింహాచారి, మహ్మద్‌ ఖాలేక్‌, ప్రవీణ్‌, అలీబిన్‌ అబ్దుల్లా తన ఇంట్లోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడినట్లు చెప్పారు. బాన్సువాడ బల్దియా పరిధిలోని 4వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గైని స్వప్న దంపతులు తన ఇంటికి వచ్చారన్నారు. తనపై పోటీ చేస్తున్న గైక్వాడ్‌ రుక్మిణితో గెలువలేమని కాలనీ వాసులు చెప్పారని, తాను పోటీలో ఉన్నా గెలువలేమని, స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలుగుతామని చెప్పారన్నారు. తమను మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకెళ్లాలని కోరారని తెలిపారన్నారు. అంతలోనే కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కాసుల బాల్‌రాజ్‌, ఆయన కుమారుడు రోహిత్‌తో పాటు నార్ల రత్నకుమార్‌, రవీందర్‌ రెడ్డితో పాటు సుమారు 30 మంది ఇంటిపైకి వచ్చి దాడికి వచ్చారని రాజు తెలిపారు. తానే అభ్యర్థిని విత్‌డ్రా చేయిస్తున్నానని దుర్భాషలాడుతూ కొట్టారని అన్నాడు. కాంగ్రెస్‌ నాయకులు గెలిస్తే పట్టణంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.


logo