బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 12, 2020 , 02:30:48

బాన్సువాడ బల్దియాలో టీఆర్‌ఎస్‌ బోణీ

బాన్సువాడ బల్దియాలో టీఆర్‌ఎస్‌ బోణీబాన్సువాడ, నమస్తే తెలంగాణ : తెలంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు జై కొడుతున్నారు. దీంతో వరుసగా జరుగుతున్న ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కడుతున్నారు. పురపోరు లో సైతం ఆ పార్టీవైపే అందరూ మొగ్గుచూపుతున్నారు. నామినేషన్ల దాఖలు ముగిసిన మరుసటి రోజు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల అధికారికి పత్రాన్ని అందజేసింది. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రుక్మిణి ఎన్నిక లాంఛ నం కానుంది. మున్సిపాలిటీగా అవతరించిన అనంత రం బాన్సువాడ బల్దియాకు జరుగుతున్న తొలిపోరులో బోణీ కొట్టిన టీఆర్‌ఎస్‌ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు.

బాన్సువాడ మున్సిపాలిటీలో 4వ వార్డు కాంగ్రెస్‌ పా ర్టీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన గైని స్వప్న శనివారంమున్సిపల్‌ కార్యాలయం చేరుకొని  తాను స్వచ్ఛందంగా  నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు రిటర్నింగ్‌ అధికారులకు  పత్రాలను అందించింది. నామినేషన్‌ వేసి మరుసటి రోజే విత్‌ డ్రా చేసుకోవడం కాంగ్రెస్‌ శ్రేణులకు విస్మయానికి గురిచేసింది. స్పీకర్‌ పోచా రం బాన్సువాడలో చేపడుతున్న అభివృ ద్ధితోనే కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకున్నదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  పురపోరుకు ముందే తమ పార్టీ అ భ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నది. బాన్సువాడలో జరిగిన అభివృద్ధి తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు టానిక్‌లా పనిచేస్తున్నదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

కంగుతిన్న కాంగ్రెస్‌..

బల్దియా 4వ వార్డు అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం కాంగ్రెస్‌ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాన్సువాడ చైర్మన్‌ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించారు. అందరికంటే ముందే కాంగ్రెస్‌ పార్టీ నుంచి చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పార్టీ నుంచి ప్రచారం కూడా ప్రారంభించారు. చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి అ నారోగ్యం బారిన పడడంతో నామినేషన్‌ కూడా దాఖలు చేయలేదు. దీంతో కాంగ్రెస్‌ వర్గాలు కంగుతిన్నాయి. చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ వేయకపోవడం, ఓ వార్డు నుంచి అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్‌ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ సంఘటనలతో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరాశకు గురవుతుండగా టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం కనబడుతున్నది.


logo