బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 12, 2020 , 02:29:22

ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి

ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి


బాన్సువాడ, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని జుక్కల్‌ ఎమ్మెల్యే, బాన్సువాడ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి హన్మంత్‌ షిండే అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జుక్కల్‌ నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ, సింగిల్‌ విండో అధ్యక్షులు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు, కార్యదర్శులతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలపై చర్చించారు. బాన్సువాడ పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారని అన్నారు. బాన్సువాడలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికలపై జుక్కల్‌ నియోజకవర్గం లోని అన్ని మండలాల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో ఆదివారం సమావేశాలు నిర్వహించాలని మండల అధ్యక్షులకు సూచించారు. జుక్కల్‌ నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి పది మంది కార్యకర్తలు ప్రచారంలో పాల్గొనాలన్నారు. బాన్సువాడ 19 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, మాజీ ఎంపీపీ రజనీకాంత్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పాల్గొన్నారు.


logo
>>>>>>