గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 10, 2020 , 12:33:50

ఇంటింటికీ వెళ్లి.. చెత్త సేకరించి..

ఇంటింటికీ వెళ్లి.. చెత్త సేకరించి..

ధర్పల్లి : గ్రామాల్లో చెత్తాచెదారం ఎక్కడ పడితే అక్కడ పారవేయకుం డా మండలంలోని మద్దుల్ తండా పంచాయతీ పరిధిలోని జీపీ అధ్వర్యంలో గ్రామ సర్పంచ్ దేవేందర్ బుధవారం ఇంటింటికీ చెత్త బుట్టలను జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల సారికారెడ్డితో పంపిణీ చేయించారు. తడి, పొడి చెత్తలు వేర్వేరుగా వేయాలని గ్రామస్తులకు వివరించారు. దీంట్లో భాగంగానే స్వయంగా సర్పంచ్ గురువారం ఇంటింటికీ వెళ్లి గ్రామస్తుల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించారు. ప్రతిరోజూ ఇలాగే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుం డా చెత్త బుట్టలో ఉంచి జీపీ సిబ్బందికి అందించాలని, వారు సేకరించి న చెత్తను డం పింగ్ యార్డులో వే స్తారని సర్పంచ్ గ్రామస్తులకు సూ చించారు. గ్రామ సర్పంచే స్వయం గా ఇంటింటికీ వచ్చి చెత్త సేకరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పరిశుభ్రతకు తమ వంతు పూర్తి సహకారమందిస్తామని పేర్కొన్నారు.


logo