సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 10, 2020 , 12:31:52

అటూ ఇటూ రెండే గేట్లు..

అటూ ఇటూ రెండే గేట్లు..

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే ప్లాజా వద్ద 10 గేట్లుండగా.. నగదు చెల్లింపులకు అటు రెండు, ఇటు రెండు గేట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో  ఫాస్టాగ్ గేట్లు కావడంతో ట్యాగ్ ఉన్న వాహనదారులు ఎక్కువ సమయం ఆగకుండా వెళ్తున్నారు. దీంతో సమయం కలిసివస్తున్నది.

15వ తేదీ నుంచి ఒకే లైన్‌లో నగదు చెల్లింపు..
ఈ నెల15వ తేదీలోగా హైదరాబాద్, నాగ్‌పూర్ వెళ్లడానికి ఒక గేటు మాత్రమే నగదు చెల్లింపుల కోసం ఉంటుందని టోల్‌ప్లాజా మేనేజర్ చంద్రమోహన్ పేర్కొన్నారు. ఎంత రద్దీ ఉన్నా ఫాస్టాగ్ గేటులోకి ఒకవేళ వాహనం తప్పిదంగా వస్తే ఆ వాహనాలకు డబుల్ బాదుడు తప్పదని పేర్కొన్నారు. వాహనదారులందరూ ఫాస్టాగ్‌లను కచ్చితంగా తీసుకోవాలన్నారు. జనవరి 15 తర్వాత కూడా నగదు చెల్లింపు రెట్టింపు ఉండదన్నారు. పోవడానికి, రావడానికి ఒక లైన్ మాత్రమే ఉంటుందని, దీన్ని వాహనదారులు గమనించాలని సూచించారు. టోల్‌ప్లాజా పరిధిలో ఏర్పాటు చేసిన పాయింట్ ఆఫ్ సేల్స్‌ను వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫాస్టాగ్‌కు అనుసంధానంగా కొన్ని జాతీయ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయని, బ్యాంకుల్లో ప్రతిఒక్కరూ ఫాస్టాగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మినిమమ్ బ్యాలెన్స్ రూ.వెయ్యి ఉండేలా చూసుకోవాలన్నారు. సెక్యూరిటీ బ్యాలెన్స్‌కు రూ.200, మినిమమ్ బ్యాలెన్స్ రూ.200, ట్యాగ్ ఖరీదు రూ.100ల చొప్పున ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని సూచించారు.

ట్యాగ్‌లు అమర్చడంలో తలెత్తుతున్న సమస్య..
టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ తీసుకొంటే సిబ్బంది వాహన అద్దం ముందు అతికిస్తారు. బ్యాంకుల ద్వారా ఫాస్టాగ్‌లు తీసుకున్న వాహనదారులకు ఎక్కడ అమర్చాలో తెలియక అద్దం పక్కన లేదా కిందికి అతికిస్తున్నారు. దీంతో ప్లాజా వద్దకు వచ్చిన వాహనాన్ని స్కాన్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిబ్బంది వచ్చి స్కాన్ చేసి వాహనాన్ని వదలాల్సి వస్తున్నది. దీంతో సమయం వృథా అవుతుంది. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని, వాహనం అద్దం ముం దుభాగంలో ట్యాగ్‌ను అమర్చుకోవాలని, అప్పుడే ట్యాగ్ స్కాన్ చేసేందుకు అవకాశం ఉంటుందని టోల్‌ప్లాజా మేనేజర్ తెలిపారు.


logo