వార్షికోత్సవం సందర్భంగా వీడియో సాంగ్ సీడీ ఆవిష్కరణ
హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి
ఖలీల్‌వాడి, ఆగస్టు 6: తెలంగాణ జాగృతి 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ కవి, రచయిత నరాల సుధాకర్ రచించిన ‘తెలంగాణ జాగృతి వార్షికోత్సవ సంబు రం’ వీడియో సాంగ్ సీడీని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి శుక్ర వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంకిషన్‌రావు మాట్లాడుతూ.. పాటలో తెలంగాణ జాగృతి ప్రస్థానాన్ని, లక్ష్యాలను నరాల సుధాకర్ చక్కగా వివరించారని అన్నారు. వీడియోలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను చక్కగా చూపెట్టారని అభినందించారు. ఈ పాటకు సంగీతం అందించిన విజయ్, సంతోష్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ పాటను పాడిన విజయ్ భవిష్యత్తులో నిజామా బాద్‌కు మంచి పేరు తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు ఈగ గంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జాగృతి ముందుండి పోరాడిందని అన్నారు. బతుకమ్మను ట్యాంకుబండ్ పై ఆడి వలస పాలకులకు బుద్ధి చెప్పిందని గుర్తు చేశారు. బతుకమ్మను అవహేళన చేసిన వారే నెత్తిమీద బతుకమ్మను ఎత్తుకొని పూజించేలా చేసింది తెలంగాణ జాగృతి అని అన్నారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు మాట్లాడుతూ.. సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తి నరాల సుధాకర్ అని అన్నారు. తన రచనలతో సమాజానికి మంచి సందేశాలు ఇస్తారన్నారు. రచయిత నరాల సుధాకర్ మాట్లాడుతూ.. తనకు కవితక్క అంటే ఎనలేని అభిమానమని అన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ఆమె సమాజానికి చేస్తున్న సేవలకు ఆకర్షితుడినై జాగృతిలో చేరానని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వ హించిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్, హరీశ్ యాదవ్, దండు శ్రీకాంత్, కొయ్యాడ శంకర్, గోపాల్, చింటు, రంజిత్, విక్కీ, దామోదర్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.