e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 23, 2021
Home కామారెడ్డి గ్రామాల్లో కొనసాగుతున్న ‘ప్రగతి’ పనులు

గ్రామాల్లో కొనసాగుతున్న ‘ప్రగతి’ పనులు

గ్రామాల్లో కొనసాగుతున్న ‘ప్రగతి’ పనులు

నిజాంసాగర్‌/లింగంపేట/ నాగిరెడ్డిపేట్‌, జూలై 13 : గ్రామాల్లో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. జుక్కల్‌ మండలం నాగల్‌గావ్‌ గ్రామంలో మంగళవారం కరెంటు తీగలను విద్యుత్తు శాఖ సిబ్బంది సరిచేశారు. వంగిపోయిన, శిథిలావస్థలో ఉన్న స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. వీధి దీపాలను అమర్చారు. బస్వాపూర్‌ గ్రామంలో పంచాయతీ సిబ్బంది మురికి కాలువల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు.లింగంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయని ఎంపీవో ప్రభాకర్‌ చారి తెలిపారు. మండలంలోని అయ్యపల్లి, శెట్పల్లి, పర్మళ్ల, సురాయిపల్లి, కన్నాపూర్‌, ఒంటర్‌పల్లి గ్రామాల్లో చేపట్టిన పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలకు కంచెలు ఏర్పాటు చేయాలని సర్పంచులకు సూచించారు.

విలేజ్‌ పార్కు పనుల పరిశీలన
నాగిరెడ్డిపేట్‌ మండలంలోని మెల్లకుంట తండాలో ఏర్పాటుచేస్తున్న పల్లె ప్రకృతి వనాన్ని ఎంపీవో శ్రీనివాస్‌ మంగళవారం పరిశీలించారు. పార్కులో నాటిన మొక్కల వివరాలను ఈసీ మధును అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్రామాల్లో కొనసాగుతున్న ‘ప్రగతి’ పనులు
గ్రామాల్లో కొనసాగుతున్న ‘ప్రగతి’ పనులు
గ్రామాల్లో కొనసాగుతున్న ‘ప్రగతి’ పనులు

ట్రెండింగ్‌

Advertisement