e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home కామారెడ్డి అర్హులందరికీ రేషన్‌ కార్డులు

అర్హులందరికీ రేషన్‌ కార్డులు

మద్నూర్‌/బిచ్కుంద, జూలై 27: అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు రేషన్‌ కార్డులను అందజేసి ఆహారభద్రత కల్పిస్తామని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. మద్నూర్‌, బిచ్కుంద మండలకేంద్రాల్లో మంగళవారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కొత్త రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మద్నూర్‌ మండలానికి 492 కొత్త కార్డులు మంజూరయ్యాయని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కరు కూడా పస్తులుండకుండా, కడుపునిండా తినాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. పేదలు సంతోషంగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్‌, డీఎస్‌వో రాజశేఖర్‌, ఎంపీపీలు లక్ష్మీబాయి, అశోక్‌పటేల్‌, జడ్పీటీసీలు అనిత, భారతీరాజు, డీసీసీబీ డైరెక్టర్‌ రామ్‌పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ సాయాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్‌, సొసైటీ చైర్మన్‌ శ్రీనుపటేల్‌, సర్పంచులు దరాస్‌ సూర్యకాంత్‌, గఫార్‌, రాజుపటేల్‌, ఎంకే పటేల్‌, అనూయా లక్ష్మీనారాయణ ఎంపీటీసీలు సంగీతాకుశాల్‌, అనుసూయా శివాజీ, సాయిలు, విజయ్‌, తహసీల్దార్లు సుధాకర్‌, ఆనంద్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, నాయకులు అశోక్‌పటేల్‌, బాబూపటేల్‌, నర్సింహులుగౌడ్‌, శంకర్‌రావు పాల్గొన్నారు.

పలు గ్రామాల్లో..
నాగిరెడ్డిపేట్‌/బాన్సువాడ, జూలై 27 : నాగిరెడ్డిపేట్‌ మండలంలోని ఆత్మకూరు గ్రామంలో 17 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేసిందని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. వాటిని లబ్ధిదారులకు జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌ బాల్‌రెడ్డి మంగళవారం అందజేశారు.

- Advertisement -

తాడ్కోల్‌లో..
బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామంలో మంజూరైన రేషన్‌కార్డులను డీసీసీబీ డైరెక్టర్‌ భూషణ్‌రెడ్డి సర్పంచ్‌ రాజమణి, ఎంపీటీసీ సభ్యురాలు ఇంద్రతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఉపసర్పంచ్‌ బండ సంగారెడ్డి, మాజీ సర్పంచ్‌ గంగారాం, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్‌, వార్డు మెంబర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పిట్లంలో నేడు పంపిణీ
మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్‌ కార్డులను బుధవారం పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్‌ రామ్మోహన్‌రావ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలపరిషత్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే హాజరై పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana