e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home జనగాం మెగా పార్కులకు స్థలాల గుర్తింపు

మెగా పార్కులకు స్థలాల గుర్తింపు

  • పది ఎకరాల స్థలంలో బృహత్‌ పల్లెప్రకృతి వనం
  • 15 మండలాల్లో భూముల సర్వే పూర్తి
  • త్వరలోనే ప్రారంభం కానున్న పనులు
  • కలెక్టర్‌ హరిత
మెగా పార్కులకు స్థలాల గుర్తింపు

వర్ధన్నపేట, జూలై 17: మండలానికో బృహత్‌ పల్లెప్రకృతి వనం ఏర్పాటు కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నదని కలెక్టర్‌ హరిత అన్నారు. మండలంలోని ఉప్పరపల్లిలో పార్కు స్థలంతోపాటు శ్మశానవాటికను శనివారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. సుమారు పది ఎకరాల స్థలంలో బృహత్‌ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. జిల్లా పరిధిలోని 15 మండలాల్లో ఇప్పటికే 10 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూములను గుర్తించినట్లు వెల్లడించారు. పరకాల మండలంలో తేలాల్సి ఉందన్నారు. చిట్టడవిని తలపించేలా మెగా పార్కుల్లో అన్ని రకాల మొక్కలను నాటిస్తామన్నారు. వర్ధన్నపేట మండలానికి సంబంధించి ఉప్పరపల్లి గ్రామం పక్కన ఉన్న ఎస్సారెస్పీ భూమిని ఎంపిక చేశామన్నారు. మండలాల వారీగా అధికారులు బాధ్యత తీసుకొని త్వరలోనే పనులు ప్రారంభిస్తారన్నారు. అధికారులకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. శ్మశానవాటికపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్‌రావు, ఆర్డీవో మహేందర్‌జీ, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, రాయపర్తి తహసీల్దార్‌ సత్యనారాయణ, సర్పంచ్‌ ఆరెల్లి స్రవంతి, ఆర్‌ఐ లోకేశ్‌, ఏపీవో నాగేశ్వర్‌ పాల్గొన్నారు.

పనులను త్వరగా పూర్తి చేయాలి
పర్వతగిరి: గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ హరిత సూచించారు. గోపనపల్లి, కొంకపాక, అనంతారం గ్రామాలను ఆమె సందర్శించారు. గోపనపల్లిలో శ్మశాన వాటిక, పల్లెప్రగతి పనులు, అనంతారం, కొంకపాకలో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలను పరిశీలించి, మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వైకుంఠధామాల పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని సూచించారు. విలేజ్‌ పార్కులు, డంపింగ్‌ యార్డులు, నర్సరీలను గ్రామాల్లో ప్రభుత్వ లక్ష్యానికగుణంగా ఏర్పాటు చేసి నిరంతరం పనులు కొనసాగించాలని సూచించారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాలు శుభ్రంగా మారాయని, ఇది నిరంతర ప్రక్రియ కావాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా హరితహారంలో మొక్కలు నాటి రక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్‌రావు, డీపీవో ప్రభాకర్‌, ఆర్డీవో మహేందర్‌జీ, తహసీల్దార్‌ మహమూద్‌ అలీ, ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్‌, ఎంపీవో మధుసూదన్‌, ఏపీవో సుశీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -

రెండు మీటర్ల మేర మొక్కలు నాటాలి
సంగెం: ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఇరువైపులా రెండు మీటర్ల మేర మొక్కలు నాటాలని కలెక్టర్‌ ఎం హరిత అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. తీగరాజుపల్లిలో రోడ్లకిరువైపులా నాటుతున్న మొక్కలను శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. ఉపాధిహామీ కూలీలు నాటుతున్న చిన్నమొక్కలను చూసి ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో నాటొద్దన్నారు. గ్రామ పంచాయతీ నర్సరీల్లో పెద్ద మొక్కలు లేకుంటే గ్రీన్‌ఫండ్‌తో కొనుగోలు చేసి నాటాలన్నారు.

రెండు రోజుల్లో హద్దులు ఏర్పాటు చేయిస్తాం..
గ్రామ కూడలిలో గత హరితహారంలో నాటిన మొక్కలను గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తొలగించాడని, ఆర్‌అండ్‌బీ అధికారులతో హద్దులు నాటించాలని కలెక్టర్‌కు సర్పంచ్‌ కర్జుగుత్త రమాగోపాల్‌ విన్నవించారు. రెండు రోజుల్లో హద్దులు ఏర్పా టు చేయిస్తానని తెలిపారు. శ్మశానవాటిక నిర్మించినా డబ్బులు రాలేదని సోమ్లాతండా సర్పంచ్‌ మంగ్యానాయక్‌ కలెక్టర్‌కు తెలిపారు. వివరాలు పంపించాలని ఎంపీడీవో మల్లేశంను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్‌రావు, ఆర్డీవో మహేందర్‌జీ, డీపీవో ఆర్‌ ప్రభాకర్‌, ఎంపీటీసీ రంగరాజు నర్సింహస్వామి, ఆర్‌ఐ ఆనంద్‌, కార్యదర్శి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెగా పార్కులకు స్థలాల గుర్తింపు
మెగా పార్కులకు స్థలాల గుర్తింపు
మెగా పార్కులకు స్థలాల గుర్తింపు

ట్రెండింగ్‌

Advertisement