e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జయశంకర్ గర్మిళ్లపల్లె ప్రగతి ముల్లె

గర్మిళ్లపల్లె ప్రగతి ముల్లె

గర్మిళ్లపల్లె  ప్రగతి ముల్లె

సర్కారు సాయంతో సమస్యలు మాయం
పల్లె ప్రగతితో పరిశుభ్ర వాతావరణం
విశాలమైన రోడ్డుతో అంతర్‌ జిల్లాలకు కేంద్ర బిందువు
టేకుమట్ల, మార్చి 24:జిల్లా కేంద్రానికే కాదు.. టేకుమట్ల మండలకేంద్రానికి చిట్టచివరన ఉండి అభివృద్ధికి నోచుకోని గర్మిళ్లపల్లి, నేడు స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వం ఇస్తున్న నిధులు.. ‘పల్లె ప్రగతి’ స్ఫూర్తి.. పంచాయతీ పాలకులు, అధికారుల ప్రత్యేక చొరవతో ఒక్కో సమస్యను అధిగమించింది. ఫలితంగా సరిహద్దు పల్లెలో ఇబ్బందులు తీరిపోయి వీధివీధికీ సీసీరోడ్లు, పట్టణాలకు తీసిపోని విధంగా మూడు పల్లె ప్రకృతి వనాలతో కొత్తకళ సంతరించుకున్నది. నిత్యం ట్రాక్టర్‌ ద్వారా చెత్త సేకరిస్తుండడంతో పరిశుభ్రంగా కనిపించే పరిసరాలు.. సెగ్రిగేషన్‌ షెడ్డు, చివరి మజిలీ చింత తీర్చే శ్మశానవాటిక అందుబాటులోకి వచ్చాయి.

గ్రామ జనాభా 2648. అందులో ఎస్సీలు 584, ఎస్టీలు 46, బీసీలు 1813, ఓసీలు 205మంది ఉన్నారు. పంచాయతీ పాలక వర్గం పల్లె ప్రగతిని పక్కా ప్రణాళికతో అమలుచేస్తుండడంతో ప్రజలకు అన్ని సదుపాయాలూ అం దుబాటులోకి వచ్చాయి. పట్టణానికి దీటుగా రూ.6లక్షలతో మూడు పల్లె ప్ర కృతి వనాలు ఏర్పాటుచేశారు. తీరొక్క మొక్కలను తెప్పించి నాటడంతో పాటు నిత్యం సర్పంచ్‌ నల్లబెల్లి రమా రవీందర్‌, పంచాయతీ కార్యదర్శి బొమ్మ శ్రీ కాంత్‌గౌడ్‌ సంరక్షణ చర్యలు తీసుకున్నారు. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేసి, వీధుల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేశారు. వీటిని జీపీ సిబ్బంది ఎప్పటిక ప్పుడు సేకరిస్తూ ట్రాక్టర్‌లో డంపింగ్‌ యార్డ్‌కు తరలిస్తుండడంతో గ్రామ పరి సరాలన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటున్నందుకు గాను అప్పటి కలెక్టర్‌ అబ్దుల్‌ అజీం.. సర్పంచ్‌ను అభినం దించారు. పోలీసుల సూచన మేరకు గ్రామస్తుల సహకరంతో సీసీ కెమెరాలు అమర్చుకొని జీపీ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇదివరకు దసరా పండుగప్పుడు మాత్రమే కొన్ని విద్యుత్‌ స్తంభాలకు లైట్లు పెట్టే పరిస్థితి ఉండే ది. ఇప్పుడు గ్రామంలోని 251 స్తంభాలకు పల్లె ప్రగతి పనుల్లో థర్డ్‌ వైర్‌ వేసి, రూ.4లక్షలతో ఎల్‌ఈడీ లైట్లు, మూడు సెంటర్లలో సెంట్రింగ్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. రూ.35లక్షలతో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేయించారు. రూ.12.60 లక్షలు వెచ్చించి అన్ని సదుపాయాలతో వైకుంఠధామం నిర్మించగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హరితహారంలో మొక్కలకు ట్రీగార్డులు అమర్చి నిత్యం జీపీ ట్యాంకర్‌తో నీరు పోసి సంరక్షిస్తున్నారు. ఇప్పుడవి ఏపుగా పెరిగాయి. గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా ఐదు మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకుల ద్వారా రక్షిత మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. సైడ్‌ కాల్వలను శుభ్రం చేస్తూ, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించి, దోమల మందును పిచికారీ చేస్తూ సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను నిర్మించుకుంటున్నారు.

అంతర్‌ జిల్లాలతో అనుసంధానం
సరిహద్దున ఉన్న గర్మిళ్లపల్లి ఇప్పుడు అంతర్‌ జిల్లాలతో అనుసంధానం కానుంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల నుంచి, భూపాలపల్లి జిల్లాకేంద్రం నుంచి గ్రామానికి డబుల్‌ రోడ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు గర్మిళ్లపల్లి నుంచి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడెడ్‌ మీదుగా నిర్మిస్తున్న డబుల్‌ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఈ రోడ్డు పూర్తి చేసుకుని, మానేరులో వంతెన పూర్తయితే పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాతో పాటు మహారాష్ట్రతో రాక పోకలు పెరుగుతాయి. దీని వల్ల గర్మిళ్లపల్లి వ్యాపార పరంగా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో గ్రామం అన్నింటా ప్రగతి సాధిస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పల్లెప్రగతితో పట్టుదల పెరిగింది
గ్రామాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేయాలనే నా తపనకు, రాష్ట్ర ప్ర భు త్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం తోడవ్వడంతో మరింత పట్టుదల పెరిగింది. గ్రామస్తుల సహకారం, పాలకవర్గం సమన్వయంతో అభివృద్ధి చేసుకుంటున్నాం. అధికారుల సూచనల మేరకు ప్రణాళికలు వేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం.

  • నల్లబెల్లి రమ, సర్పంచ్‌

అందరి సహకారంతో ముందుకు..
గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీలకతీతంగా సహకరిస్తున్నారు. సర్పంచ్‌ కూడా అన్నింటా ముందుండి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మొక్క లు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామస్తుల కృషి మరువలేనిది. పన్నులు చెల్లింపుపై అవగాహన కల్పిస్తున్నాం. పల్లె ప్రగతిలో గ్రామస్తులను భాగస్వాములం చేసి ముందుకెళ్తున్నాం.

  • బొమ్మ శ్రీకాంత్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గర్మిళ్లపల్లె  ప్రగతి ముల్లె

ట్రెండింగ్‌

Advertisement