e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జయశంకర్ ముందస్తు వర్షాలతో సాగు ముమ్మరం

ముందస్తు వర్షాలతో సాగు ముమ్మరం

జోరుగా పత్తి, వేరుశనగ, పెసర సాగు
కుటుంబసభ్యులతో కలిసి
వ్యవసాయ పనుల్లో బిజీగా రైతులు

దుగ్గొండి, జూన్‌ 12 : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు పంటల సాగును ముమ్మరం చేశారు. గత సంవత్సరం కంటే ఈ వానకాలం సీజన్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో దుక్కులు దున్ని విత్తనాలు వేస్తున్నారు. ఈ సారి మండలం లో 24,766 ఎకరాలు సాగవుతుంద ని వ్యవసా య అధికారుల అంచ నా. వర్షాల నేపథ్యంలో శివాజీనగర్‌, వెంకటాపురం, దుగ్గొండి, నాచినపల్లి, దేశాయిపల్లి, రేఖంపల్లి, తొగర్రాయి, గిర్నిబావి, లక్ష్మీపురం గ్రామాల్లో, శివారు తండాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో బీజీగా మారారు. అత్యధిక రైతులు పత్తి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. బావుల్లో నీరున్న రైతులు వరి నార్లు పోసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్‌ కాకతీయ’లో పూ డిక తీయించింది. చెరువు కట్టలను పటిష్టం చేసి, తూములకు మరమ్మతు చేయడంతో గత సంవత్సరం నుంచి నీటి నిల్వ పెరిగింది. దీంతో వరి విస్తీర్ణం సైతం పెరుగుతున్నది.
చెరువు మట్టితో సారవంతం
వేసవి సీజన్‌లో మండలంలోని ఆయా గ్రామాల రైతులు చెరువు మట్టిని తమ పంట పొలాలకు తరలించారు. గతంలో ఎడ్లబండ్లలో తరలించినప్పుడు ఎక్కువ విస్తీర్ణంలో చెరువు మట్టి చేరకపోయేది. గత సంవత్సరం నుంచి రైతులు ట్రాక్టర్లలో తరలిస్తుండడంతో పెద్ద ఎత్తున చెరువు మట్టి పంట పొలాల్లో చేరింది. దీంతో భూ సారం పెరిగి పంటల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. బావుల కింద ఉన్న వ్యవసాయ భూముల రైతులు ఇప్పటికే పత్తి విత్తనాలు పెట్టారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, కందులు, వేరుశనగ పండించేందుకు విత్తనాలు సాగు చేశారు. గత వారం వరకూ 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇబ్బందులు పడిన రైతులు ముందుస్తు వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో ట్రాక్టర్లతో దున్నుతూ విత్తనాలు వేస్తున్నారు.
పెరుగనున్న సాగు : చిలువేరు దయాకర్‌, ఏవో
ఈ వానకాలం సీజన్‌లో మండలం లో వరి 4,047 ఎకరాల్లో, మిర్చి 9,167 ఎకరాలు, పత్తి 8,961 ఎకరాలు, మొక్కజొన్న 3,866 వేల ఎకరాల్లో సాగవుతుం ది. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నందున భూమిలో పదును ఉన్నప్పు డే నాణ్యమైన విత్తనాలతో పంటలు సాగు చేయాలి. సందేహాలుంటే రైతులు తమను సంప్రదించాలి.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement