e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జనగాం ‘ఉచిత విద్యుత్‌'పై హర్షం

‘ఉచిత విద్యుత్‌’పై హర్షం

‘ఉచిత విద్యుత్‌'పై హర్షం

సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీలకు పాలాభిషేకం
సంబురాల్లో రజకులు, నాయీ బ్రాహ్మణులు

వర్ధన్నపేట, ఏప్రిల్‌ 5 : రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా అమలుకు ఆదేశాలిచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఫ్లెక్సీకి రజకులు, నాయీబ్రాహ్మణుల సంఘం నాయకులు సోమవారం పాలాభిషేకం చేశారు. వర్ధన్నపేట బస్టాండ్‌ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంగోత్‌ అరుణ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు తీసుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగానే ముదిరాజ్‌లకు ఉచితంగా చేపపిల్లలు, గీతకార్మికులకు పన్ను రద్దు, చేనేత కార్మికులకు పింఛన్లు, యాదవులకు గొర్రెల పంపిణీ, ప్రస్తుతం చేతివృత్తిదారులైన రజకులు, నాయీబ్రాహ్మణుల కోసం ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేశ్‌ఖన్నా, టీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట : నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఫ్లెక్సీకి నాయీబ్రాహ్మణుల సంఘం డివిజన్‌ అధ్యక్షుడు గొలనకొండ రవీందర్‌ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మద్దికుంట్ల యాదగిరి, బైరి రంగయ్య, ఎడ్ల ప్రభాకర్‌, మొగిలిచర్ల రవీందర్‌, జిల్లె శ్రీనివాస్‌, రాసమల్ల మహేందర్‌, వల్లాజీ సురేశ్‌, కందికొండ సతీశ్‌, మురహరి వెంకటేశ్వర్లు, ఎస్‌ సాంబయ్య, సుధాకర్‌, డీ రవి, ఏకాంబ్రం, ఎం నర్సయ్య, చెన్న మోహన్‌, బీ కృష్ణ, ఎం క్రాంతి, వీ మోహన్‌, ఎం రాజు, ఎం మల్లయ్య పాల్గొన్నారు.
నడికూడలో..
నడికూడ: మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి రజకులు పాలాభిషేకం చేశారు. రజకుల సమస్యలను అర్థం చేసుకున్న మనసున్న మారాజు సీఎం కేసీఆర్‌ అని రజక సంఘాల సమితి రాష్ట్ర కోకన్వీనర్‌ దురిశెట్టి చందు అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పీ సంపత్‌, గొల్లపల్లి సంపత్‌, విజయ్‌, భాగ్య, వీరస్వామి, వెంకటేశ్‌, రేవంత్‌, చంద్రమౌళి, సమ్మక్క పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పర్వతగిరి: మండల కేంద్రంలో సోమవారం నాయీబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చింతపట్ల సోమేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్త్తూ పేదలకు అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకుడు రాజశేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి ఎర్రబెల్లి వెంకటేశ్వర్‌రావు, నాయకులు జంగిలి బాబు, చీమల భిక్షపతి, మాజీ ఎంపీటీసీ రమేశ్‌, మేరుగు వెంకన్న, రమేశ్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -

అడ్వాన్స్‌డ్ చాఫ్ టెక్నాల‌జీ అభివృద్ధి ప‌రిచిన డీఆర్‌డీవో

ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న దావానలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘ఉచిత విద్యుత్‌'పై హర్షం
‘ఉచిత విద్యుత్‌'పై హర్షం
‘ఉచిత విద్యుత్‌'పై హర్షం

ట్రెండింగ్‌

Advertisement