కమలాపూర్, ఏప్రిల్ 5 : కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎదిగానని పుల్ల కరుణాకర్ అన్నారు. ఇటీవల కరుణాకర్ అడిషనల్ ఎస్పీ నుంచి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉద్యోగోన్నతి పొందడంతో సోమవారం మండలంలోని ఆయన స్వగ్రామం ఉప్పల్‌లో పుల్ల కరుణాకర్-రజిని దంపతులకు కుటుంబ సభ్యులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అక్క, అన్నల తోడ్పాటుతో ఈ స్థాయికి ఎదిగినట్లు చెప్పారు. జీవితంలో ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా తట్టుకుని నిలిచినప్పుడే రాణిస్తామన్నారు. కష్టపడి చదువుకుంటేనే ఫలితం ఉంటుందని అన్నారు. అనంతరం కరుణాకర్, రజిని దంపతులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయు లు, గ్రామస్తులు, స్నేహితులు తదితరులు ఘనంగా సన్మానించారు.
ఇవి కూడా చదవండి..
టీకా వేయించుకుంటే ముక్కుపుల్ల ఉచితం..!
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్