e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News పేదింటి ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి

పేదింటి ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి

పేదింటి ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌ కుమార్‌
ఎల్కతుర్తి, ఏప్రిల్‌ 1 : పేదింటి ఆడబిడ్డలను ఆదుకునేందుకే సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో గురువారం 16 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను జడ్పీ చైర్మన్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌తో కలిసి ఆయన పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మండలంలో ఇప్పటి వరకు 1019 మంది లబ్ధిదారులకు రూ. 9.28కోట్ల కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసినట్లు వివరించారు. ప్రతి ఆడబిడ్డనూ సీఎం కేసీఆర్‌ మేనమామలా ఆదుకుంటున్నారన్నారు. రైతుబంధు, బీమా వల్ల రైతులకు లబ్ధి చేకూరుతోందన్నారు.

ఆడబిడ్డలు నీటికి ఇబ్బంది పడొద్దని నియోజకవర్గంలో రూ.11కోట్లతో బోర్లు వేయించినట్లు గుర్తుచేశారు. అలాగే, విద్యుత్‌ కొరత తీర్చేందుకు 15 సబ్‌స్టేషన్లు నిర్మించామని, మరొకటి దామెరలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గంలోని 96వేల ఎకరాలకు నీరందించనున్నట్లు తెలిపారు. ఎల్కతుర్తి-మెదక్‌ రోడ్డుకు అనుమతులు రావడం హర్షణీయమన్నారు. అలాగే, వరంగల్‌-కరీంనగర్‌ రోడ్డు మరమ్మతు కోసం ఎప్పటికప్పుడు సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ చైర్మన్‌ శ్రీపతి రవీందర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ తంగెడ నగేశ్‌, వైస్‌ చైర్మన్‌ మునిగడప శేషగిరి, రైల్వే బోర్డు మెంబర్‌ ఎల్తూరి స్వామి, మార్కెట్‌ డైరెక్టర్‌ తంగెడ మహేందర్‌, తహసీల్దార్‌ గుజ్జుల రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో తూర్పాటి సునీత, సర్పంచ్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కొమ్మిడి నిరంజన్‌రెడ్డి, కడారి రాజు, గొల్లె మహేందర్‌ పాల్గొన్నారు.
భీమదేవరపల్లిలో..
భీమదేవరపల్లి : మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల అనితారమేశ్‌, జడ్పీటీసీ వంగ రవి, తహసీల్దార్‌ పోలం ఉమారాణి, ఎంపీడీవో భాస్కర్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చుడండి

దవాఖానల్లో మళ్లీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు

ఆటో వద్దనే భూమి రిజిస్ట్రేషన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదింటి ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి

ట్రెండింగ్‌

Advertisement