e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జయశంకర్ కరోనా బాధితులకు కొండంత అండగా..

కరోనా బాధితులకు కొండంత అండగా..

కరోనా బాధితులకు కొండంత అండగా..

అన్నదానాలు, సరుకులు పంపిణీ చేస్తున్న పలు సంస్థలు, నాయకులు
ఊరూరా ఆర్థికసాయాలు అందజేత

నర్సంపేట, మే 20 : కరోనా విపత్తులో ప్రజలకు సాయం అందించేందుకు పలు సంస్థలు, వ్యక్తులు, నాయకులు ముందుకు వస్తున్నారు. బాధితులకు కొండంత అండగా నిలుస్తున్నారు. గురువారం నర్సంపేటలోని ఏరియా దవాఖానలో 200 మంది కరోనా రోగులకు ఆర్మీ జవాన్‌ బత్తిని విజేందర్‌ ఆధ్వర్యంలో అన్నదానం, బ్రెడ్లు, గుడ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సంపేట ఏసీపీ ఫణీందర్‌ దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్‌ జాన్సన్‌ పాల్గొన్నారు.
అన్నారం షరీఫ్‌లో..
పర్వతగిరి : మండలంలోని అన్నారం షరీఫ్‌లో పోలీసులు, ప్రజాప్రతినిధులు కలిసి దర్గా వద్ద 150 మంది యాచకులు, పేదలకు అన్నదానం చేశారు. ముఖ్యఅతిథిగా పర్వతగిరి సీఐ కిషన్‌ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో కల్లెడ పీఏసీఎస్‌ చైర్మన్‌ మోటపోతుల మనోజ్‌, పీఎస్‌ఐ ముత్యం రాజేందర్‌, సర్పంచ్‌ యశోదా బాబు, మాజీ జడ్పీటీసీ పంతులు నాయక్‌, కోఆప్షన్‌ సభ్యుడు షబ్బీర్‌ అలీ, ఉపసర్పంచ్‌ రామసాని మదన్‌మోహన్‌, మహేందర్‌, యాకయ్య పాల్గొన్నారు. అనంతరం పెట్రోల్‌ పంపు వద్ద ప్రజలకు సీఐ అవగాహన కల్పించారు.
దుగ్గొండి మండలంలో..
దుగ్గొండి : మండలంలోని మద్దునూరు ఎస్సీకాలనీలో కరోనా బాధితులకు టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి పోతుల అజయ్‌ కూరగాయలు, పండ్లు, గుడ్లు పంపిణీ చేశారు. సర్పంచ్‌ సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీ కొంగర రవి అరుణ పాల్గొన్నారు. అలాగే, తిమ్మంపేట, మందపల్లి, మహ్మదాపురం, నాచినపల్లి గ్రామాల్లో బాలవికాస ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మోడెం విద్యాసాగర్‌గౌడ్‌, మొగ్గం మహేందర్‌, నీలవేణి కుమారస్వామి, పెండ్యాల మమతా రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంద గ్రామంలో..
వర్ధన్నపేట : మండలంలోని ఇల్లంద గ్రామంలో కరోనాతో బాధపడుతున్న ఐదు కుటుంబాలకు సేవాభారతి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవా భారతి ప్రతినిధి మోడెం కుమారస్వామి, ప్రేమ్‌ప్రసాద్‌, వెంకటస్వామి, సంపత్‌ పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం : మండలకేంద్రంలో కరోనా బారిన పడిన కుటుంబాలకు సర్పంచ్‌ శాఖమూరి చిరంజీవి ఆర్థికసాయం అందజేశారు. అలాగే, జీపీ, వైద్య సిబ్బంది జ్వర పరీక్ష నిర్వహించారు. ఉపసర్పంచ్‌ మేడిద కుమార్‌, కార్యదర్శి సుప్రజ, ఏఎన్‌ఎం సునీత పాల్గొన్నారు.
గురిజాల గ్రామంలో..
నర్సంపేట రూరల్‌ : మండలంలోని గురిజాలలో సోఫార్‌ కెనడా వారి ఆర్థికసాయంతో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సర్పంచ్‌ మమత, సంస్థ కోఆర్డినేటర్‌ దేవేంద్ర, గొడిశాల సదానందం గౌడ్‌, మంచిక కుమారస్వామి, మాటూరి రవీంద్రాచారి, సాంబయ్య, వేముల వేణు, రజిత పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండల కేంద్రానికి చెందిన తడుక స్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించగా బాధిత కుటుంబానికి టీఆర్‌ఎస్‌ యువనేత కంది కృష్ణచైతన్యరెడ్డి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో అడుప రమేశ్‌, ఉప్పునూతుల రాజు, వాకిటి విక్రమ్‌, ననుమాస సాయికుమార్‌, మరాటి రాజు పాల్గొన్నారు.
కాట్రపల్లిలో..
రాయపర్తి : మండలంలోని కాట్రపల్లిలో మాజీ ఎమ్మెల్యే కుందూరు లక్ష్మీనర్సింహారెడ్డి కుమారుడు వెంకట్‌రెడ్డి-జయశ్రీ దంపతులు 20 బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అమెరికాలో ఉంటున్న కుటుంబ సభ్యులు కుందూరు విశ్వ, కుందూరు విప్ర సహకారంతో అందజేసినట్లు వారు తెలిపారు. సర్పంచ్‌ బోనగిరి ఎల్లయ్య, ఉప సర్పంచ్‌ రేణుకా యాకయ్య, వార్డు సభ్యులు మొర్రి రాజేందర్‌, చిడిమిల్ల అశోక్‌కుమార్‌, గుమ్మడిరాజు శ్రీనివాస్‌, మహ్మద్‌ అన్వర్‌, కత్తి సోమన్న, మహ్మద్‌ జహంగీర్‌ పాల్గొన్నారు.
బుడిగ జంగాల కాలనీలో..
సంగెం : మండలంలోని కుంటపల్లి గ్రామం బుడిగ జంగాల కాలనీలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ పాల్‌ విశ్వనాథ్‌, సర్పంచ్‌ కావటి వెంకటయ్య, నరహరి, చిర్ర పాల్‌, రాజ్‌కుమార్‌, బొజ్జ సురేశ్‌, చిర్ర మొగిళి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా బాధితులకు కొండంత అండగా..

ట్రెండింగ్‌

Advertisement