e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జయశంకర్ దారి దోపిడీకి పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

దారి దోపిడీకి పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

దారి దోపిడీకి పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

రూ.2.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్‌జోషి

హన్మకొండ సిటీ, మే 20 : దారి దోపిడీకి పాల్పడడంతో పాటు ఇళ్ల లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్‌, గీసుగొండ పోలీసు లు సంయుక్తంగా ఆరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.50 లక్షల విలువ చేసే 13 గ్రామలు బంగారు ఆభరణాలు, 630 గ్రాముల వెండి, రూ.48 వేల నగదు, 17 విదేశీ కరెన్సీ నోట్లతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి గురువారం వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని పేతాళ్లగడ్డకు చెందిన మందనపు సుభాశ్‌ 2008 సంవత్సరం నుంచి చోరీలు చేస్తున్నాడు. నిందితుడు రైళ్లలో మహిళల మెడలో నుంచి బంగారు గొలుసు లు చోరీలు చేయడంతో పాటు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంతంలో మహిళపై లైంగికదాడికి యత్నించిన కేసులో జైలు జీవితం గడిపాడు. నాలుగేళ్ల క్రితం గొర్రెకుంటలోని కీర్తినగర్‌కు భార్యా పిల్లలతో వచ్చి కర్రకోత మిషన్‌లో పనికి కుదిరాడు. గత సంవత్సరం కీర్తినగర్‌ నుంచి ఇల్లెందుకు కారు కిరాయి మాట్లాడుకుని మార్గమధ్యంలో డ్రైవర్‌ను కొట్టి చేతిరింగు తీసుకున్నాడు. దానిని ముత్తూట్‌ ఫైనాన్‌ల్సో తాకట్టుపెట్టి డబ్బులు తీసుకున్నా డు.

ఆ తర్వాత మడికొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీ చేశాడు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 5న గీసుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తిని చంపుతానని బెదిరించి రూ.46 వేలు దోపిడీ చేశాడు. ఇంతెజార్‌గంజ్‌ పీఎస్‌ పరిధిలో మరో చోరీకి పాల్పడ్డాడు. ఈ నెల 14న గీసుగొండ పీఎస్‌ పరిధిలోని కీర్తినగర్‌ కాలనీలో పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి డిక్కీ నుంచి రూ.8 వేల నగదులో పాటు 17 విదేశీ కరెన్సీ నోట్లను దొంగిలించాడు. గురువారం గీసుగొండ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు సిబ్బందితో గొర్రెకుంట క్రాస్‌ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా పైనేరాలను ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తు స్వాధీనం చేసుకుని పోలీసులు అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. కాగా, నిందితుడి నుంచి సొత్తు రాబట్టడంలో కృషి చేసిన ఏసీపీలు నరేశ్‌కుమార్‌, బాబురావు, సీసీఎస్‌ సీఐ రమేశ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, ఎస్సై అబ్దుల్‌ రహీం, బండారి రాజు, కానిస్టేబుల్‌ మహేందర్‌, సీసీఎస్‌ సిబ్బందిని సీపీ అభినందించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దారి దోపిడీకి పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

ట్రెండింగ్‌

Advertisement