e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జనగాం రైతన్నా.. జర భద్రం !

రైతన్నా.. జర భద్రం !

రైతన్నా.. జర భద్రం !

విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్లలో జాగ్రత్త
హీరో, హీరోయిన్లు, సినిమాల పేరిటపత్తి విత్తనాలు
అప్రమత్తంగా లేకుంటే అసలుకే ఎసరు
వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తేనే మేలు

ఐనవోలు, జూన్‌ 6: ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్లుగా పలు విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులను సులువుగా విక్రయించుకునేందుకు విపరీత ఆలోచనలతో వస్తున్నాయి. తమ కంపెనీ ద్వారా విక్రయించే విత్తన ప్యాకెట్లకు హీరో, హీరోయిన్ల పేర్లు, హిట్‌ సినిమాల పేర్లు పెడుతూ రైతులకు అంటగడుతున్నాయి. నకిలీ కంపెనీల మాయలో పడి మోసపోవద్దని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కంపెనీలు పెట్టే ఆఫర్లను చూసి బోల్తా పడొద్దని హెచ్చరిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించాలి
వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్‌ పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనాలి.
కొనుగోలు సమయంలో బిల్లులో విత్తన రకం, నంబర్‌, గడువు తేదీ, కొనుగోలు తేదీ, డీలర్‌ సంతకం ఉండేలా చూసుకోవాలి. లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు తెరిచిన డబ్బాల్లో ఉన్న విత్తనాలను కొనవద్దు.
బిల్లుపై విక్రయదారు పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకపు నంబర్‌, రైతు పేరు, గ్రామం పేరు, విక్రయదారు సంతకం, తేదీలు, రకం పేరు, బ్యాచ్‌ నంబర్‌, గడువు తేదీ, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి.
కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్‌, సీసా, సంచి, డబ్బాలపై సీలు ఉందా లేదా నిర్ధారించుకోవాలి.
విక్రయదారు ఇచ్చే కరపత్రాలను తీసుకొని వాటిపై పేర్కొన్న అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
మొలకెత్తే దశ, పూల దశలో లోపాలు కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.
విత్తనాల కొనుగోలు సమయంలో తీసుకున్న బిల్లులను (రసీదు) పంట కాలం పూర్తయ్యే దాకా భద్రపర్చాలి.
విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని పరిశీలించాలి.
ఎరువుల కొనుగోలులో..
లైసెన్స్‌డ్‌ దుకాణాల్లోనే ఎరువులు కొనాలి. కొనుగోలు సమయంలో ఇచ్చిన బిల్లు, ఖాళీ సంచులు పంట పూర్తయ్యే వరకు భద్రపర్చాలి.
మిషన్‌ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులను మాత్రమే వాడాలి. ఒకవేళ చేతి కుట్టుతో ఉంటే బస్తా చివరన సీసం సీల్‌ ఉందో లేదో చూసుకోవాలి.
ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్తత్తి సంస్థ, ఉత్పత్తి దారు పేరు కచ్చితంగా ఉండాలి.
కొనుగోలు సమయంలో డీలర్‌ రసీదులో రైతు విధిగా సంతకం చేయాలి. ఎరువుల నాణ్యతపై అనుమానాలు ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో పరీక్షలకు పంపాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతన్నా.. జర భద్రం !

ట్రెండింగ్‌

Advertisement