e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జనగాం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు

తొరూర్రు, నవంబర్‌ 26: గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనాలని ఎంపీపీ తుర్పాటి చిన్నఅంజ య్య అన్నారు. మండలంలోని అమ్మాపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం లో తేమ మిషన్‌తో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఫిర్యాదు చేయగా, శుక్రవారం తహసీల్దార్‌ వేంరెడ్డి రాఘవరెడ్డితో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు.తేమ యంత్రంతో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. మ్యాచర్‌ 17.2, 17.3 వచ్చిన కాంటాలు చేసి మిల్లులకు పంపాలన్నారు. ప్రభుత్వం ఏ-గ్రేడ్‌ ధాన్యానికి రూ.1960, బీ-గ్రేడ్‌ ధాన్యానికి రూ. 1940 మద్దతు ధర ఇస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ముద్దం విక్రమ్‌రెడ్డి, రైతులు మాచర్ల శ్రీనివాస్‌గౌడ్‌, తీగల వెంకట్‌రెడ్డి, సంజీవరెడ్డి, కొత్తూరు సత్తయ్య, గుంటుక నారాయణ, బూరుగు వీరేశ్‌, ఉప్పలయ్య పాల్గొన్నారు.
తేమశాతం లేకుండా జాగ్రత్త తీసుకోవాలి
నర్సింహులపేట, నవంబర్‌ 26: రైతులు ధాన్యంలో తేమశాతం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్‌ ఇమ్మానియేల్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని ముంగిముడుగు, వంతడపల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్త, తాలు, మట్టిపెళ్లలు, రంగుమా రిన, మొలుకెత్తిన ధాన్యం లేకుం డా చూడాలని సూచించారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్‌, సర్పంచ్‌ యల్లు మధుసూదన్‌రెడ్డి, సర్పంచులు మేర్గు శంకర్‌గౌడ్‌, శంకర్‌నాయక్‌, కిషన్‌నాయక్‌, కాలు నాయక్‌, సంధ్య, ఉదయ్‌, ఏపీఎం సంజీవరావు, భీముడు, ఏఈవోలు రామకృష్ణ, కరిష్మ, మౌనిక, శశిరేఖ, శోఖ, నర్సయ్య, సహదేవ్‌ పాల్గొన్నారు.
కురవి: మండలంలోని సీరోలులో ఐకేపీ ఆధ్వర్యంలో సర్పంచ్‌ శ్యామల రంగమ్మ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. మరిపెడ డివిజన్‌ ఆత్మచైర్మన్‌ తోట లాలయ్య, ఎంపీటీసీ భోజ్యానాయక్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్‌ గుగులోత్‌ రవి, ఉపసర్పంచ్‌ నాగేశ్వరరావు, ఐకేపీ ఎపీఎం కిరణ్‌కుమార్‌, సీఏలు, మహిళా సంఘం ప్రతినిధులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తదితలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement