బాలల సంక్షేమానికి కృషి చేయండి

భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 23:బాలల సంక్షేమానికి సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నూతనంగా ఏర్పడిన బాలల సంక్షేమ సమితి సభ్యులు, చైర్మన్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జేసీ స్వర్ణలతను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, జేసీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనుబంధ శాఖల సహకారంతో జిల్లాలను బాలల స్నేహ పూర్వక జిల్లాగా మార్చాలని, బాలల హక్కుల పరిరక్షణలో తన సహకారం ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్మన్ దాస్యం వేణుగోపాల్, సభ్యులు దామోదర్, రాజేంద్రప్రసాద్, డాక్టర్ సుధాకర్, బాల రక్షా భవన్ జిల్లా కోఆర్డినేటర్ శిరీష, జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ, బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- కందకుర్తి సరిహద్దులో ఇంజక్షన్ కలకలం