బుధవారం 03 మార్చి 2021
Jayashankar - Feb 23, 2021 , 02:33:11

నిధులను సద్వినియోగం చేసుకోండి

నిధులను సద్వినియోగం చేసుకోండి

భూపాలపల్లి రూరల్‌, ఫిబ్రవరి 22: అత్యంత వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి భారత డైనమిక్‌ లిమిటెడ్‌ ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. భారత డైనమిక్‌ లిమిటెడ్‌ ఆర్థిక సహాయంతో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సోమవారం కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ బాలికలు, బాలుర హాస్టళ్లకు సంబంధించిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. రైతు వేదికలు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి కే.సామ్యూల్‌, ఉప గణాంక అధికారి సాంబయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ నిరంజన్‌ రావు, పంచాయతీ రాజ్‌ డీఈలు వెంకటేశ్వర్లు, సాయిలు, సంబంధిత హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు పాల్గొన్నారు.


VIDEOS

logo