ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 23, 2021 , 02:33:13

విజేత జట్లకు నగదు అందజేత

విజేత జట్లకు నగదు అందజేత

మహాముత్తారం, ఫిబ్రవరి22: జిల్లా స్థాయి మెగా  కబడ్డీ పోటీల్లో  విజయం సాధించిన జట్లకు టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి ఆదివారం రాత్రి నగదు బహుమతులు అందజేశారు. మూడు రోజుల నుంచి పుట్ట లింగమ్మ చారిట్రబుల్‌ ట్రస్టు సహకారంతో, పోలంపల్లి యువ చైతన్య యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానంలో బొమ్మాపూర్‌, ద్వితీయ స్థానంలో మహబూబ్‌పల్లి, తృతీయ స్థానంలో వాజేడు జట్లు నిలిచాయి. ప్రథమ బహుమతి రూ.10,000, ద్వితీయ బహుమతి రూ. 5,000, తృతీయ బహుమతి రూ.3,000ను జట్లకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మార్క రాముగౌడ్‌, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మందల రాజిరెడ్డి,  సింగిల్‌విండో చైర్మన్‌ సోమ శాంతకుమార్‌, ఎంపీటీసీ శ్రీపతి సురేశ్‌, ఉప సర్పంచ్‌ మధుకర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అనిల్‌రెడ్డి, కాటారం మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రాధారపు స్వామి, యూత్‌ కమిటీ అధ్యక్షుడు కిరణ్‌, పీఈటీలు  అంకూస్‌, వెంకటేశ్‌, రాజబాపు పాల్గొన్నారు. VIDEOS

logo