శనివారం 06 మార్చి 2021
Jayashankar - Feb 23, 2021 , 02:33:25

తన భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని..

తన భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని..

  • పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
  • కాటారం తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఘటన

కాటారం, ఫిబ్రవరి 22 : తాను సాగు చేసుకుంటున్న భూమిని మరో వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని తెలిసి మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కాటారం మం డల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో సోమ వారం జరిగింది. బాధితుడు కొట్టె శ్రీనివాస్‌, సోదరుడు శంకర య్య,  కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కాటారానికి చెందిన కొట్టె శ్రీనివాస్‌ కొన్నేండ్లుగా సర్వే నంబర్‌ 55లోని ఎకరం మూడు గుంటల భూమిని సాగు చేసుకుంటున్నాడు. గతంలో ఈ భూమిని గారెపల్లికి చెందిన లచ్చయ్య వద్ద కొనుగోలు చేయగా, రిజిస్ట్రేషన్‌ సయమంలో సర్వే నంబర్‌ 56 అని తప్పుగా పడింది. కాటారానికి చెందిన జక్కు తిరుపతికి సర్వే నం.56లో వారసత్వంగా వచ్చిన కొంత భూమి ఉంది. ఈ క్రమంలో ఎకరం మూడు గుంటల భూమి విషయంలో గత కొంతకాలంగా తిరుపతి, శ్రీనివాస్‌కు మధ్య వివాదం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం ధరణి పోర్టల్‌ ద్వారా జక్కు తిరుపతి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. విషయం తెలిసి శ్రీనివాస్‌ అక్కడకు చేరుకొని తన భూమిని ఇతరుల పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారంటూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసబ్యులు శ్రీనివాస్‌ను దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్‌ రామ్మోహన్‌ మాట్లాడుతూ.. భూమి విషయంలో అభ్యంతరాలు ఉన్నందున సమగ్ర విచారణ చేసి న్యాయం చేస్తామన్నారు. 

VIDEOS

logo