శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Feb 22, 2021 , 03:02:50

ప్రశాంతంగా ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు

ప్రశాంతంగా ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు

భూపాలపల్లి రూరల్‌, ఫిబ్రవరి 21: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌టీఎస్‌ఈ), నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో మహ్మద్‌ అబ్దుల్‌ హై, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి బానోత్‌ జుమ్ము తెలిపారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం1.30 నుంచి 3.30 గంటల వరకు భూపాలపల్లి ఉన్నత పాఠశాలలో ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షకు 54 విద్యార్థులకు 52 మంది హాజరయ్యారని తెలిపారు. ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జంగేడు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షకు159 మంది విద్యార్థులకు 130 మంది హాజరైనట్లు తెలిపారు.


VIDEOS

logo