సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Feb 22, 2021 , 03:02:50

సమాజ సేవలో ముందుండాలి

సమాజ సేవలో ముందుండాలి

రేగొండ, ఫిబ్రవరి21: సమాజ సేవలో యువత ముందుండాలని ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్‌ అన్నారు. నారాయణపురం గ్రామంలో ఆదివారం యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఎస్సై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఒకరి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మున్ముందు యువత మరిన్ని సేవా కార్యక్రమాలను బాధ్యతగా చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కోటంచ ఆలయ చైర్మన్‌ హింగే మహేందర్‌, సర్పంచ్‌ జైకోటి సునీత రవి, ఉపసర్పంచ్‌ రజాక్‌, యూత్‌ సభ్యులు కిరణ్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo