శనివారం 06 మార్చి 2021
Jayashankar - Feb 22, 2021 , 03:02:52

‘నిందితులను కఠినంగా శిక్షించాలి’

‘నిందితులను కఠినంగా శిక్షించాలి’

  • జిల్లా న్యాయవాదుల సంఘం 
  • సభ్యుడు శ్రీనివాసా చారి

కృష్ణకాలనీ/ఏటూరునాగారం, ఫిబ్రవరి 21: హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు నాగమణిని హత్య నిందితులకు కఠిన శిక్ష వేయాలని జిల్లా న్యాయవాదుల సంఘం సభ్యుడు శ్రీనివాసాచారి అన్నారు. ఇటీవల జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను  నిరసిస్తూ ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లాలోని న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ హైకోర్టు ద్వారా జుడ్యియల్‌ ఎంక్వయిరీ చేపట్టాలని  డిమాండ్‌ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఆరికట్టడానికి ప్రభుత్వం అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్టు చేయాలని అన్నారు. న్యాయవాద దంపతులకు ప్రగాడ సంతాపం తెలిజజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు చల్లూరి మధు, మంగళపెల్లి రాజ్‌ కుమార్‌, సంగెం రవి, విష్ణువర్ధన్‌, సంతోష్‌, రాకేశ్‌, వెంకటస్వామి, సాంబశివ, దుప్పటి ప్రవీణ్‌, ప్రియాంఖ, దివ్య, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  ఏటూరునాగారం మండల కేంద్రంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు న్యాయవాదుల హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. హత్య జరిగిన సమయంలో కాపాడాలని అరిచినా ఏ ఒక్కరూ స్పందించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 

VIDEOS

logo