మంగళవారం 09 మార్చి 2021
Jayashankar - Feb 22, 2021 , 03:02:52

బాలల రక్షణ బాధ్యతగా తీసుకోవాలి

బాలల రక్షణ బాధ్యతగా తీసుకోవాలి

చిట్యాల, ఫిబ్రవరి21: బాలికలు లైంగిక దాడులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా బాలల పరిరక్షణ విభాగం(డీసీపీవో) అధికారి బీ.హరికృష్ణ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రాంనగర్‌ కాలనీలో మానవత స్వచ్ఛంద సంస్థ ఫౌండర్‌ సోని మహేందర్‌ ఆధ్వర్యంలో బాలల సంరక్షణపై సంస్థ వలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి డీసీపీవో, స్థానిక ఎస్సై వీరభద్రరావు అతిథిలుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా డీసీపీవో మాట్లాడుతూ..గ్రామాల్లో బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను అరికట్టాలన్నారు. పిల్లలను చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని, పిల్లలకు ఏమైనా ఆటంకాలు, అవరోధాలు కల్గినపుడు వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1098కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు. ఎస్సై మాట్లాడుతూ.. బాలల హక్కులు, బాలల పరిరక్షణ అంశాలును ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలన్నారు. కొవిడ్‌ సమయంలో పిల్లలకు సాయం చేసేందుకు  ముందుకు వచ్చిన సంస్థ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి, సర్పంచ్‌ ఇరుకులపాటి పూర్ణ చందర్‌రావు, ఎంపీటీసీ కట్కూర పద్మానరేందర్‌, సంస్థ వలంటీర్లు గుర్రం రాజేందర్‌, యుగేందర్‌, సాంబయ్య, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo