శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Feb 21, 2021 , 02:31:45

చట్ట ప్రకారం నష్ట పరిహారం

చట్ట ప్రకారం నష్ట పరిహారం

  • జేసీ కూరాకుల స్వర్ణలత
  • కాసీంపల్లి రైతులతో సమావేశం

భూపాలపల్లి రూరల్‌, ఫిబ్రవరి 20: జెన్కో కన్వేయర్‌ బెల్ట్‌ భూ నిర్వాసితులకు చట్టం ప్రకారం నష్ట పరిహారం లభించేలా చర్యలు తీసుకుంటామని జేసీ కూరాకుల స్వర్ణలత అన్నారు. తాడిచ ర్ల ఓపెన్‌ కాస్ట్‌ నుంచి చెల్పూర్‌ జెన్కోకు కన్వేయర్‌ బెల్ట్‌ ఏర్పాటు చేసి బొగ్గు సరఫరా చేసేందుకు కాసీంపల్లి గ్రామ రైతుల భూములను జెన్కో తీసుకోనుంది. దీంతో భూములు కోల్పో యే రైతులతో శనివారం సింగరేణి ఇల్లందు క్లబ్‌ హౌస్‌లో జేసీ  సమావేశం ఏర్పాటు చేసి భూసేకరణ, నష్టపరిహారంపై చర్చించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ కాసీంపల్లి భూపాలపల్లి పట్టణంలో భాగమైనందున మార్కెట్‌ విలువ ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలన్నారు. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు మేలు కలిగేలా నష్ట పరిహారం చెల్లింపుపై జిల్లా కలెక్టర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌, జెన్కో ఎస్‌ఈ తిరుపతయ్య, రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌ కార్యాలయ భూసేకరణ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నిక సాఫీగా నిర్వహించండి

సాధారణ ఎన్నికలు విజయవంతం చేసినట్లే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సాఫీగా నిర్వహించాలని జేసీ స్వర్ణలత అధికారులకు సూచించారు. శనివారం ఆమె తన కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నిక మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిఘా బృందాలన్నింటికీ నేతృత్వం వహించి పర్యవేక్షించాలని భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్‌ను ఆదేశించారు. సమావేశంలో ఎన్నికల వివిధ కమిటీల నోడల్‌ అధికారులు శ్రీనివాస్‌, అక్బర్‌, సుదర్శన్‌, వేణు, ఆశాలత, సుధీర్‌కుమార్‌, అబ్దుల్‌హై, రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo