సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Feb 21, 2021 , 02:31:47

జోరుగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

జోరుగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

చిట్యాల, ఫిబ్రవరి 20 : టీఆర్‌ఎస్‌ సభ్య త్వ నమోదు కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతున్నది. గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛం దంగా వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నా రు. చిట్యాల మండలం చల్లగరిగెలో శనివా రం టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన స భ్యత్వ నమోదు కార్యక్రమంలో గ్రామ ఇన్‌చార్జి ఏరుకొండ రాజేందర్‌ ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి, సర్పంచ్‌ కర్రె మంజూలఅశోక్‌రెడ్డికి సభ్యత్వం అందజేశారు. ఏలేటిరామయ్యపల్లిలో సర్పంచ్‌ ఏలేటి సరోజన, యువకులకు గ్రామ ఇన్‌చార్జి, టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు జె న్నె యుగేంధర్‌ సభ్యత్వ రసీదులు అందజేశారు.

ఎమ్మెల్యే ఇచ్చిన టార్గెట్‌ పూర్తి చేస్తా

కృష్ణకాలనీ : టీఆర్‌స్‌ సభ్యత్వాల నమోదులో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేస్తానని 11వ  వార్డు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అజయ్‌ యాదవ్‌ అన్నారు. శనివారం వేశాలపల్లి లో సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో బానోత్‌ జమ్ములాల్‌, ప్రసాద్‌ యాదవ్‌  పాల్గొన్నారు.

టేకుమట్లలో..

టేకుమట్ల : మండలంలోని పలు గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షులు, సర్పం చులు, ఎంపీటీసీలు, యూత్‌ నాయకులు, నాయకులు గ్రామాల్లో ఇంటింటికీ ప్రభు త్వ పథకాలను వివరిస్తూ సభ్వత్వాలను చేయిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కత్తి సంపత్‌ గౌడ్‌ తెలిపారు.

కాటారంలో..

కాటారం : మండలంలోని మద్దులపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు డోలి అర్జయ్య ఆధ్వర్యంలో శనివారం వాడవాడలా తిరిగి సభ్యత్వ నమో దు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరు చూసి ప్ర జలు, రైతులు, ముఖ్యంగా యువతీ యువకులు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. 

సుభాశ్‌కాలనీలో..

భూపాలపల్లి రూరల్‌ : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి సుభాశ్‌కాలనీలో 17వ వార్డు కౌన్సిలర్‌ ముంజంపెల్లి మురళీధర్‌ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. శనివారం  ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్‌ అభిమానులతో సభ్యత్వం నమోదు చేయించారు. కార్యక్రమంలో  శ్రీరామ్‌, రాజేందర్‌, రాజు, తదిరులు పాల్గొన్నారు.

VIDEOS

logo