సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Feb 21, 2021 , 02:31:49

కార్మికుల సంక్షేమానికి పాటుపడింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే..

 కార్మికుల సంక్షేమానికి పాటుపడింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే..

  • టీబీజీకేఎస్‌ నేత కొక్కుల తిరుపతి

భూపాలపల్లి, ఫిబ్రవరి 20 : సింగరేణి కార్మికుల సంక్షేమానికి పాటుపడింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రమేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సం ఘం(టీబీజీకేఎస్‌) భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి అన్నారు. శనివారం కేటీకే ఓసీపీ-2 గని వద్ద టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ ఫలాలు అమలు చేయిస్తుందన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ నేతలు నల్లబెల్లి సదానందం, ఎం సమ్మిరెడ్డి, ప్రేమ్‌సింగ్‌, కుసుమ సుధాకర్‌, రాజ్‌కిరణ్‌, కార్మికులు పాల్గొన్నారు.


VIDEOS

logo