గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 21, 2021 , 02:31:49

కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి

కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి

కాటారం,  ఫిబ్రవరి 20 : కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉంటూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎస్సీ సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ హన్మంతు నాయక్‌, డీఎస్‌సీడీవో సునీత హాస్టల్‌ సిబ్బందికి సూచించారు. శనివారం వారు మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో వసతులు, హాస్టల్‌ పనితీరును పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకొని మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. పిల్లల్లో ఎవరికైనా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. హాస్టల్‌ను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వారి వెంట సూపరింటెండెంట్‌ శ్రీదేవి, భవాని ఉన్నారు.

VIDEOS

logo