సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Feb 20, 2021 , 02:19:43

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో  మానసికోల్లాసం

మహాముత్తారం, ఫ్రిబవరి 19: క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో ఉపయోగపడుతాయని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మార్క రాముగౌడ్‌ అన్నారు. శుక్రవారం పోలంపల్లిలో పుట్ట లింగమ్మ చార్టిబుల్‌ ట్రస్టు సాహకారంతో పోలంపల్లి యువచైతన్య యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి మెగా కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ నెల 21 వరకు క్రీడలు జరుగుతాయని రాముగౌడ్‌ అన్నారు.  60 కబడ్డీ జట్లు పాల్గొన్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు మందల రాజిరెడ్డి, కాటారం మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ రాదారపు స్వామి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అనిల్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీపతి సురేశ్‌, భూపాలపల్లి జిల్లా కబడ్డీ జిల్లా అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు రాజన్న, చైతన్య యూత్‌ అధ్యక్షుడు గోరికె కిరణ్‌, పీఈటీలు షేక్‌ అంకూస్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్‌, సీనియర్‌ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo