గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 20, 2021 , 02:19:43

అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయాలి

అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయాలి

భూపాలపల్లి, ఫిబ్రవరి 19: అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి సంస్థ  ప్రగతికి పాటుపడాలని భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం ఈ.సీహెచ్‌ నిరీక్షణ్‌రాజ్‌ అన్నారు. స్థానిక జీఎం కార్యాలయ ఆవరణలో ఆయన శుక్రవారం సింగరేణి కార్మికుల వారసులకు  కారుణ్య నియామక ఉత్తర్వులను అందించారు. ఆయన మాట్లాడుతూ పట్టుదలతో పనిచేయాలన్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమలో ఉద్యోగం పొందడం అదృష్టమని జీఎం అన్నారు. కార్యక్రమంలో  అధికార ప్రతినిధి ఎస్‌.అనిల్‌కుమార్‌, ఫైనాన్స్‌ మేనేజర్‌ ఎం.అనురాధ, సీనియర్‌ అసిస్టెంట్‌ సంజీవరావు, గుర్తింపుసంఘం (టీబీజీకేఎస్‌) నేత తుమ్మేటి రఘోత్తంరెడ్డి, ప్రాతినిధ్య సంఘం(ఏఐటీయూసీ) నేత రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo