మంగళవారం 09 మార్చి 2021
Jayashankar - Feb 20, 2021 , 02:19:43

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ పుస్తకాల పంపిణీ

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ పుస్తకాల పంపిణీ

భూపాలపల్లి టౌన్‌/మొగుళ్లపల్లి/ములుగురూరల్‌/గణపురం, ఫిబ్రవరి19: భూపాలపల్లి మండలంలోని రూరల్‌, అర్బన్‌లో మొదటి విడుతగా 430 సభ్యత్వ పుస్తకాలను పంపిణీ చేశామని టీఆర్‌ఎస్‌ అర్బన్‌, రూరల్‌ మండల అధ్యక్షులు క్యాతరాజు సాంబమూర్తి, మందల రవిందర్‌రెడ్డి తెలిపారు. భూపాలపల్లి పట్టణంలో 160 క్రియాశీల, 250 సాధారణ, రూరల్‌లో 40 క్రియాశీల, 80 సాధారణ సభ్యత్వ పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో శుక్రవారం ఇన్‌చార్జిలకు సభ్యత్వ నమోదు పుస్తకాలను అందజేసినట్లు అర్బన్‌ అధ్యక్షుడు తెలిపారు.  కార్యక్రమంలో టీఆర్‌స్‌ అర్బన్‌ ప్రధాన కార్యదర్శి తాటి అశోక్‌, కోఆప్షన్‌ సభ్యులు దొంగల ఐలయ్య, నాయకులు బైరెడ్డి లక్ష్మారెడ్డి, పెద్దిరెడ్డి జనార్దన్‌, ఆకుదారి రాయమల్లు పాల్గొన్నారు. మొగుళ్లపల్లి జడ్పీటీసీ జోరుక సదయ్య, పార్టీ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు శుక్రవారం మండల కేంద్రంలో ముఖ్య నాయకులకు కార్యకర్తలకు సభ్యత్వ పుస్తకాలను అందజేసి, సభ్యత్వ నమోదును ప్రారంభించారు. సొసైటీ చైర్మన్‌ సంపెల్లి నర్సింగరావు, దండ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు అన్నారెడ్డి, శ్యాంమ్‌ సుందర్‌రెడ్డి, దానబోని రాములు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ములుగు మండలంలోని జంగాలపల్లి, కన్నాయిగూడెం, కాసిందేవిపేట, పంచోత్కులపల్లి, రాయినిగూడెం గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు కాకి పురుషోత్తం, పెట్టెం మల్లికార్జున్‌, లియాకత్‌అలీ, మాజీ సర్పంచ్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపురం పీఏసీఎస్‌ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి మండల కేంద్రంలో కార్యకర్తలకు సభ్యత్వ నమోదు పుస్తకాలను అందించారు. సభ్యత్వ నమోదు ప్రారంభించారు. సర్పంచ్‌ దేవేందర్‌గౌడ్‌, ఎంపీటీసీ శివశంకర్‌ గౌడ్‌, ఉప సర్పంచ్‌ పోతర్ల అశోక్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


VIDEOS

logo