శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Feb 17, 2021 , 02:53:24

ప్రజా సమస్యలపై అధికారులు శ్రద్ధ వహించాలి

ప్రజా సమస్యలపై అధికారులు శ్రద్ధ వహించాలి

  • ఎంపీపీ మల్హల్‌రావు

మల్హర్‌, ఫిబ్రవరి 16 : ప్రజల సమస్యలపై అధికారులు శ్రద్ధవహిస్తూ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులకు సహకరించాలని ఎంపీపీ మల్హల్‌రావు అన్నారు. మండల ప్రజా పరిషత్‌ కా ర్యాలయంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, చేపట్టబోయే పనుల వివారాలు అధికారులు సభ్యులకు వి వరించారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తి స్థాయిలో చాలా గ్రామాల్లో చేపట్టకపోవడంతో నీరు రావడంలేదని, లీకేజీలు అవుతున్నాయని అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడంలేదని సర్పంచులు స భ దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్‌ అధికారులకు సమస్యలు విన్నవించినా పట్టించుకోవడంలేదని గత సర్వసభ్య సమావేశంలో చెప్పినా ఇప్పటికీ చేయడంలే దన్నారు. భూ సమస్యలపై కార్యాలయానికి వెళ్తే తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పనులు చేయడం లేదని చెప్పారు. దీంతో భూ సమస్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయని సభ్యులు వాపోయారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశం మధ్యలో కొందరు అధికారులు వెళ్లిపోవడం చర్చనియాంశంగా మారింది. సమావేశంలో మంథని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, రాంబట్ల సంతోషిని, పీఏసీఎస్‌ చైర్మన్‌ చేప్పాల రామారావు, ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రకాశ్‌రెడ్డి, ఎంపీటీసీలు బడితెల స్వరూప, రావుల కల్పన, మల్క కవిత, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. మంథని మార్కెట్‌ చైర్మన్‌గా ఎన్నికై తొలిసారి మండలానికి వచ్చిన సంతోషినిని ఎంపీపీ మల్హల్‌రావు, ఎంపీటీసీలు, సిబ్బంది శాలువాతో సన్మానించారు.

VIDEOS

logo