సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Feb 16, 2021 , 02:02:03

తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌

తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌

  • తల్లిదండ్రులతో సమానంగాపార్టీని చూసుకోవాలి
  • భారీగా సభ్యత్వ నమోదు చేపట్టండి
  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు
  • ప్రతి సభ్యుడికి డిజిటల్‌ ఐడీ కార్డు : పోచంపల్లి
  • పదవుల కోసమే దీక్షలు : గండ్ర
  • కార్యకర్తలే దేవుళ్లు : వాసుదేవరెడ్డి

కృష్ణకాలనీ, ఫిబ్రవరి 15 : పిడికెడు మందితో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ పార్టీ నేడు కోటి మంది కార్యకర్తలతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఏర్పడిందని కరీంనగర్‌ ఎమ్మెల్సీ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాద్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జి నారదాసు లక్ష్మణరావు అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్‌నగర్‌లో ఉన్న ఏఎస్సార్‌ గార్డెన్‌లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం జరిగింది. ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణరావు మాట్లాడారు. భూపాలపల్లిలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదుండ్రులకు ఎంత సేవ చేస్తామో .. పదవులిచ్చిన పార్టీకి అంతే సేవ చేయాలని పిలపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి పండుగలా సభ్యత్వ నమోదు చేపట్టాలన్నారు. 

డిజిటల్‌ కార్డు అందజేస్తాం : పోచంపల్లి 

ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయాలని ఎమ్మెల్సీ, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సభ్యత్వం తీసుకునే సమయంలో ఫొటో జతచేయాలన్నారు. త్వరలో సభ్యులకు డిజిటల్‌ ఐడీ కార్డు అందజేస్తామని అన్నారు. ఎప్పుడైనా కార్యకర్తలు ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందన్నారు. మండలానికో తెలంగాణ భవన్‌ నిర్మించేలా సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలే కార్యకర్తలను ప్రజల్లోకి తీసుకెళ్తాయన్నారు. 

80 వేల సభ్యత్వాలు చేయిస్తాం : గండ్ర 

భూపాలపల్లి నియోజకవర్గం నుంచి 80వేల సభ్యత్వాలు చేయిస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రతి గ్రామానికి ఇన్‌చార్జిని నియమించి నమోదును విజయవంతం చేస్తామన్నారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించాలని సవాల్‌ విసిరారు. గత ఎన్నికల్లో సుమారు 60వేలకు పైగా సభ్యత్వాలు చేయించామన్నారు.

‘పల్లా’నుగెలిపించాలి : వాసుదేవారెడ్డి

పట్టభద్రుల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వికలాంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్‌ వాసుదేవారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మొదటి సభ్యత్వాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వాసుదేవారెడ్డి తీసుకున్నారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకం దారుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌, మాజీ జడ్పీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు, జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ కల్లెపు శోభ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, జంగేడు పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌కుమార్‌ యాదవ్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గండ్ర హరీశ్‌ రెడ్డి, ఎంపీపీ మందల లావణ్య, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, కౌన్సిలర్లు ఎడ్ల మౌనిక, నూనె రాజు, పానుగంటి హారిక, కొక్కుల స్వరూప, మేకల రజిత, శిరుప అనిల్‌, మాడ కమల, నాగుల శిరీష, చల్ల రేణుక, మంజంపల్లి మురళీధర్‌, ముంజాల రవీందర్‌, జక్కం రవికుమార్‌, బానోత్‌ రజిత, ఆకుదారి మమత, మంగళపల్లి తిరుపతి, నాయకులు బుర్ర రమేశ్‌, తాటి అశోక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు, ప్రజా ప్రతి నిధులు నిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

VIDEOS

logo