సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Feb 15, 2021 , 01:39:17

ఘనంగా మార్కండేయ జయంతి

ఘనంగా మార్కండేయ జయంతి

కృష్ణకాలనీ/ చిట్యాల, ఫిబ్రవరి14: తెలంగాణ పద్మశాలి పరపతి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో మార్కండేయ జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంఘం సభ్యులు మార్కండేయ ఆలయ ఆవరణలో పూజలు నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌, నాయకులు భాగవతం భిక్షపతి, ఈగ రవికిరణ్‌, కుసుమ కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో  పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం స్థానిక సివిల్‌ దవాఖానలో రోగులు, బాలింతలకు పండ్ల పంపిణీ చేశారు. సంఘం మండలాధ్యక్షుడు కట్కూరి నరేందర్‌, నాయకులు కోటేశ్వర్‌, రాజేందర్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo