గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 15, 2021 , 01:39:15

సేవారత్న నేషనల్‌ అవార్డుకు ఆర్‌ఎంపీ ఎంపిక

సేవారత్న నేషనల్‌ అవార్డుకు ఆర్‌ఎంపీ ఎంపిక

కృష్ణకాలనీ, ఫిబ్రవరి14: బహుజన సాహిత్య అకాడమీ సేవారత్న నేషనల్‌ అవార్డుకు భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలోని రాంనగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ వంగ కుమారస్వామి ఎంపికయ్యారు. మార్చి 14న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించే సౌత్‌ ఇండియన్‌ బహుజన రైటర్స్‌ 4వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా కుమారస్వామికి అవార్డును అందించనున్నారు.  ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ బహుజన సాహిత్య అకాడమీ సేవారత్న నేషనల్‌ అవార్డు సెలక్షన్‌ కమిటీ జాతీయ అధ్యక్షడు నల్ల రాధాకృష్ణ ఆదివారం హైదరాబాద్‌లో కుమారస్వామికి ఆహ్వాన పత్రం అందజేశారు. జంగేడు పరిధిలోని వేశాలపల్లి, జంగేడు, రాంనగర్‌ ఫకీర్‌ గడ్డలో ఆర్‌ఎంపీ వైద్య సేవలు అందిస్తూ తనకు తోచిన రీతిలో సేవా కార్యక్రమాలు, వైద్య  శిబిరాలు ఏర్పాటు, భూపాలపల్లి మండలంలో సీజనల్‌ వ్యాధుల నివారణకు చేసిన కృషికి అవార్డుకు ఎంపిక చేసినట్లు  కమిటీ జాతీయ అధ్యక్షడు తెలిపారు. 


VIDEOS

logo